
Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్ చేసిన నటుడు మోహన్ బాబు
ఈ వార్తాకథనం ఏంటి
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'కన్నప్ప'. ఈ చిత్రానికి ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.
కాగా, ఇందులో మోహన్ బాబు ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో భాగంగా తాజాగా మోహన్‌బాబు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక వీడియోను పంచుకున్నారు.
'మై కన్నప్ప స్టోరీ' అనే పేరుతో తన తల్లి గురించి ప్రస్తావిస్తూ భావోద్వేగంగా మాట్లాడారు. తనకు నిజమైన కన్నప్ప తన తల్లేనని స్పష్టంగా చెప్పారు.
వివరాలు
మా అమ్మకు పుట్టుకతోనే రెండు చెవులు వినిపించవు: మోహన్ బాబు
''ఒక అమాయకుడు, అడవుల మధ్య జీవించిన అజ్ఞానుడు.. కానీ పరమేశ్వరుడిని ఆకట్టుకునే భక్తితో తన కన్నుల్ని సమర్పించి 'కన్నప్ప'గా చరిత్రలో నిలిచిపోయాడు. మనకు ఆకలి అని చెప్పకుండానే అన్నం పెట్టే మన అమ్మలు, మన అవసరాలన్నింటికీ తమ శక్తికి మించిన సాయం చేసే తల్లిదండ్రులే నిజమైన కన్నప్పలు. నా దృష్టిలో మా అమ్మానాన్నలు నిజంగా కన్నప్పలే. మా అమ్మ పేరు లక్ష్మమ్మ.''అని మోహన్‌బాబు గుర్తు చేసుకున్నారు.
దురదృష్టవశాత్తు ఆమెకు పుట్టుకతోనే రెండు చెవులు వినిపించేవి కాదు.అయినా పరమేశ్వరుడు ఆమెకు ఐదుగురు సంతానాన్ని వరంగా ఇచ్చాడు.
మా ఊరు టౌన్‌కి దాదాపు ఏడుకోలమీటర్లు దూరం ఉండేది. ఆ దారి కూడా అంత సులువైనది కాదు.
లోపలికి వెళ్లాలంటే ఒక కాలువను,సువర్ణముఖి నదిని దాటాల్సి వచ్చేది.
వివరాలు
జూన్ 27న సినిమా విడుదల
అలాంటి కఠినమైన మార్గాల్లో మమ్మల్ని మోసుకుంటూ మా అమ్మ ప్రయాణించేది.
ఆ శ్రమను ఊహించుకోండి.. నిజంగా అది ఎంత గొప్ప త్యాగమో. ఇవన్నీ గుర్తొస్తే మనసు భావోద్వేగంగా అనిపిస్తుంది.
నా కంఠాన్నిగురించి అందరూ ప్రశంసించేవారు.. అప్పుడు 'ఈ మాటలు మా అమ్మకి వినిపిస్తే ఎంత ఆనందపడేదో, ఓ పరమేశ్వరా!' అనుకునేవాడు. అందుకే నాకు నా తల్లి అంటే కన్నప్పే'' అని ఆయన ఉద్వేగంతో చెప్పారు.
జూన్ 27న ఈ సినిమా విడుదల కానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మోహన్ బాబు చేసిన ట్వీట్
#MyKannappaStory#kannappa #harharmahadevॐ pic.twitter.com/uFJUAE0qVg
— Mohan Babu M (@themohanbabu) June 5, 2025