Loading...
Mohanlal : మోహన్‌లాల్‌-జీతూ జోసెఫ్‌ క్రేజీ ప్రాజెక్ట్‌ రీ-ఓపెన్‌.. ఆరేళ్ల తర్వాత మళ్లీ పట్టాలెక్కిన 'రామ్‌'
మోహన్‌లాల్‌-జీతూ జోసెఫ్‌ క్రేజీ ప్రాజెక్ట్‌ రీ-ఓపెన్‌.. ఆరేళ్ల తర్వాత మళ్లీ పట్టాలెక్కిన 'రామ్‌'

Mohanlal : మోహన్‌లాల్‌-జీతూ జోసెఫ్‌ క్రేజీ ప్రాజెక్ట్‌ రీ-ఓపెన్‌.. ఆరేళ్ల తర్వాత మళ్లీ పట్టాలెక్కిన 'రామ్‌'

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 25, 2026
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

మాలీవుడ్‌ దర్శకుల్లో థ్రిల్లర్‌ సినిమాలు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు జీతూ జోసెఫ్‌. 'దృశ్యం' సినిమాతో కేవలం సౌత్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్‌ డైరెక్టర్‌.. ఆ తర్వాత మాత్రం మోహన్‌లాల్‌ను దాటి వెళ్లలేకపోతున్నారనే చర్చ సాగుతోంది. 'నేరు' సినిమా తర్వాత జీతూ జోసెఫ్‌ మూడు సినిమాలు తెరకెక్కించగా.. వాటిలో రెండు బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. అయితే 'దృశ్యం 3' మళ్లీ ఆయనను లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చింది. దీంతో మోహన్‌లాల్‌తో తన కాంబినేషన్‌ను కొనసాగిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'దృశ్యం 4' ఉంటుందా లేదా అన్నది ప్రస్తుతానికి స్పష్టత లేదు. అయితే ఎప్పుడో ప్రకటించిన మరో ప్రాజెక్ట్‌ 'రామ్‌' మాత్రం తాజాగా మళ్లీ పట్టాలెక్కింది.

వివరాలు

ఆరేళ్ల తర్వాత 'రామ్‌' రీస్టార్ట్

జీతూ జోసెఫ్‌-మోహన్‌లాల్‌ కాంబినేషన్‌లో 2020లో 'రామ్‌' సినిమాను ప్రకటించారు. అయితే మొదట కరోనా కారణంగా ఈ ప్రాజెక్ట్‌ ఆలస్యమైంది.

ఆ తర్వాత నిర్మాతలకు ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, నిధుల సమస్యల కారణంగా సినిమా పలుమార్లు హోల్డ్‌లోకి వెళ్లింది.

ప్రాజెక్ట్‌కు ఎదురైన సమస్యలన్నీ పరిష్కారం కావడంతో.. దాదాపు ఆరేళ్ల తర్వాత తాజాగా 'రామ్‌' సినిమా మళ్లీ రీస్టార్ట్‌ అయింది.

వివరాలు

రెండు భాగాలుగా యాక్షన్‌ థ్రిల్లర్

మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో త్రిష, సంయుక్త హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.

ఇందులో నటి ప్రియమణి కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల ప్రియమణి ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను సోషల్‌ మీడియాలో పంచుకుంది.

చేతిలో క్లాప్‌ బోర్డ్‌ పట్టుకున్న ఫొటోలను ఆమె షేర్‌ చేయడంతో 'రామ్‌' సినిమా షూటింగ్‌ మళ్లీ ప్రారంభమైన విషయం మరింత స్పష్టమైంది.

ADVERTISEMENT

వివరాలు

సినిమాల విషయంలో మోహన్‌లాల్‌ స్పీడ్

ఇదిలా ఉంటే.. స్టార్‌ హీరోలు ఒక్క సినిమాను పూర్తి చేయడానికి ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకుంటుంటే.. మోహన్‌లాల్‌ మాత్రం వరుసగా సినిమాలను పూర్తి చేస్తూ వాటిని థియేటర్లలోకి తీసుకొస్తున్నారని కథనం పేర్కొంటోంది.

అంతేకాదు.. ప్రధాన పాత్రలతో పాటు క్యామియో రోల్స్‌లోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే మోహన్‌లాల్‌ నుంచి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఇందులో 'దృశ్యం 3' ఫుల్‌ ఫ్లెడ్జ్‌ మూవీ కాగా.. మిగిలిన రెండు చిత్రాల్లో ఆయన క్యామియోకి మించిన పాత్రల్లో కనిపించారు.

ప్రస్తుతం మోహన్‌లాల్‌ చేతిలో ఏడెనిమిది సినిమాలు ఉన్నట్లు సమాచారం.

వరుస సినిమాలతో ఆయన కొనసాగిస్తున్న లైనప్‌, షూటింగ్‌ స్పీడ్‌ చూస్తుంటే.. స్టార్‌ హీరోలు కూడా ఆయన నుంచి నేర్చుకుంటారేమో చూడాలి.

ADVERTISEMENT