LOADING...
Mohanlal: మోహన్‌లాల్‌ కొత్త సినిమాకు 'నెడుంకండం మిరాకిల్‌' టైటిల్
మోహన్‌లాల్‌ కొత్త సినిమాకు 'నెడుంకండం మిరాకిల్‌' టైటిల్

Mohanlal: మోహన్‌లాల్‌ కొత్త సినిమాకు 'నెడుంకండం మిరాకిల్‌' టైటిల్

వ్రాసిన వారు Moogati Shabari
Jul 04, 2026
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ స్టార్‌ నటుడు మోహన్‌లాల్‌ కథానాయకుడిగా, దర్శకుడు దిలీశ్‌ కుమార్‌ పోతన్‌ తెరకెక్కిస్తున్న కొత్త సినిమాకు 'నెడుంకండం మిరాకిల్‌' అనే శీర్షికను ఖరారు చేశారు. ఈ విషయాన్ని చిత్రబృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. టైటిల్‌ను ఆవిష్కరిస్తూ రూపొందించిన ప్రత్యేక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా విడుదల చేసింది.

వివరాలు

మరోసారి పోలీసు అధికారి పాత్రలో మోహన్‌లాల్..

ఈ చిత్రాన్ని అచు బేబీ జాన్‌ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం మోహన్‌లాల్‌ 'తుడరుమ్‌' ఫేమ్‌ దర్శకుడు తరుణ్‌ మూర్తి దర్శకత్వంలో రూపొందుతున్న 'అతిమనోహరం' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన చాలా సంవత్సరాల విరామం అనంతరం మరోసారి పోలీసు అధికారి పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు.

Advertisement