Mouni Roy: భర్తను అన్‌ఫాలో చేసిన మౌనీ రాయ్.. ఇన్‌స్టా నుంచి పెళ్లి ఫొటోలు మాయం
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటి మౌని రాయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భర్త సూరజ్ నంబియార్‌తో ఆమె విడిపోతున్నారనే ప్రచారం కొన్ని రోజులుగా నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చేలా మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మౌనీ రాయ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు, టూర్ల చిత్రాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల ఆమె భర్తతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేయకపోవడం గమనార్హం.
వివరాలు
విశ్వంభర స్పెషల్ సాంగ్ లో మౌనిరాయ్
మరోవైపు సూరజ్ నంబియార్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కూడా వారి పెళ్లి ఫొటోలు కనిపించకపోవడంతో విడాకుల వార్తలు మరింత ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఈ ప్రచారంపై ఇప్పటివరకు ఇద్దరూ ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కాగా, మౌనీ రాయ్ 2022 జనవరిలో తన ప్రియుడు సూరజ్ నంబియార్‌ను గోవాలో ఘనంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న విశ్వంభర సినిమాలో మౌనీ రాయ్ ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నట్లు సమాచారం. చిరంజీవి సూపర్ హిట్ చిత్రం ఖైదీలోని 'రగులుతోంది మొగలిపొద' పాటను రీమేక్ చేయనున్నారని, ఆ పాటలో చిరంజీవితో కలిసి మౌనీ రాయ్ సందడి చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.