Ram Charan: మెగా మాస్ ట్రీట్.. రామ్ చరణ్ సినిమాలో ఎంఎస్ ధోనీ?
ఈ వార్తాకథనం ఏంటి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే.
ఈ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ తరువాత చేసిన గేమ్ ఛేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది.
ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో మెగా ఫ్యాన్స్ కూడా నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు.
రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ క్రికెటర్‌గా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
Details
ట్రైనర్ గా ధోని కనిపించే అవకాశం?
ఇక ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది.
ఈ మూవీలో రామ్ చరణ్‌తో పాటు స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
రామ్ చరణ్ క్రికెటర్‌గా కనిపిస్తే, ధోనీ ఆయనకు ట్రైనర్‌గా నటించే అవకాశం ఉందని సమాచారం.
ఇప్పటికే ధోనీ ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతుండగా, ఇప్పుడు నటుడిగా రామ్ చరణ్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇవ్వనున్నాడా? అనే ఆసక్తికర చర్చ సాగుతోంది.
ధోనీ నిజంగా ఈ సినిమాలో నటిస్తే, ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో మరింత భారీగా ప్రమోట్ అవ్వడం ఖాయం.
Details
హీరోయిన్ గా జాన్వీ కపూర్
రామ్ చరణ్‌కు పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు ఉండగా, ధోనీకి అంతర్జాతీయ స్థాయిలో అపారమైన క్రేజ్ ఉంది.
దీంతో ఈ సినిమా భారీ స్థాయిలో బిజినెస్ జరుపుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక ఈ సినిమాను బుచ్చిబాబు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతాన్ని ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు.
ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశముంది.