Page Loader
RC16: రామ్ చరణ్ సినిమా కోసం 'మున్నాభాయ్యా' దివ్యేందు సెట్‌కి చేరిక!
రామ్ చరణ్ సినిమా కోసం 'మున్నాభాయ్యా' దివ్యేందు సెట్‌కి చేరిక!

RC16: రామ్ చరణ్ సినిమా కోసం 'మున్నాభాయ్యా' దివ్యేందు సెట్‌కి చేరిక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 04, 2025
01:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్‌సీ16 అనే సినిమా చేస్తుండడం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమై మైసూర్‌లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాకు బాలీవుడ్ నటుడు 'మీర్జాపూర్' వెబ్ సిరీస్‌లో మున్నాభాయ్యాగా ఫేమస్ అయిన దివ్యేందు శర్మ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

Details

వైరల్ గా మారిన ఫోటోలు

తాజా సమాచారం ప్రకారం ఆర్‌సీ16 షూటింగ్ సెట్స్‌లో దివ్యేందు శర్మ పాల్గొన్నారు. బుచ్చిబాబు, దివ్యేందు, కమెడియన్ నవీన్ కలిసి దిగిన ఫొటోలు చిత్రబృందం షేర్ చేయగా, అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా, జాన్వీ కపూర్ కథానాయికగా కనిపించనుంది. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Embed

చిత్రయూనిట్ షేర్ చేసిన ఫోటోలు

Comedian Naveen from the sets of #RC16 with the director @BuchiBabuSana and #Divyendu AKA Munna Bhai! #RamCharan pic.twitter.com/XUMQJFiQr3— Telugu Chitraalu (@TeluguChitraalu) January 4, 2025