Janhvi Kapoor: సర్జరీకి ముందు అమ్మకు నాపై నమ్మకం లేదు.. జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల గలాటా ప్లస్ తమిళ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ తన కజిన్, నటి మహేశ్వరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. తాను నటిని కావాలనే కోరికను తల్లితో చెప్పినప్పుడు ఆమె మొదట కొంత సంశయించారని గుర్తుచేసుకున్నారు. "నేను నటిని అవుతానని అమ్మతో చెప్పినప్పుడు, ఆమె మొదట కొంచెం సందేహించారు. 'సరే, కానీ దీని కోసం నీ జీవితాన్నే అంకితం చేయాలి' అని అన్నారని జాన్వీ తెలిపారు. దీనిపై మహేశ్వరి స్పందిస్తూ.. సినీ రంగంలో రాణించాలంటే ఎంత కష్టపడాలో, ఎంత అంకితభావం అవసరమో శ్రీదేవికి బాగా తెలుసని చెప్పారు. అందుకే తన కుమార్తె విషయంలో ఆమె ఆందోళన చెందారని వివరించారు.
వివరాలు
ముక్కుకు సర్జరీ తర్వాతే నాపై నమ్మకం వచ్చింది!
ఇదే సంభాషణలో జాన్వీ ఓ సున్నితమైన విషయాన్ని బయటపెట్టారు.
"ఈ విషయాన్ని మీరు కట్ చేస్తారేమో.. కానీ నేను ముక్కుకు సర్జరీ చేయించుకోకముందు అమ్మకు నాపై అంత నమ్మకం ఉండేది కాదు.
నేను నటిని కాగలనా అనే సందేహం ఆమెలో ఉండేది. కానీ సర్జరీ తర్వాత 'పర్లేదు.. నీలో పొటెన్షియల్ ఉంది' అన్నట్లుగా ఆమె అభిప్రాయం మారింది" అని జాన్వీ అంగీకరించారు.
వివరాలు
శ్రీదేవి కూడా ముక్కుకు సర్జరీ చేయించుకున్నారట!
గతంలోనూ తన తల్లి శ్రీదేవి మార్గదర్శకత్వంలోనే తాను కొన్ని కాస్మెటిక్ సర్జరీలు చేయించుకున్నట్లు జాన్వీ వెల్లడించారు.
అంతేకాదు శ్రీదేవి కూడా తన కెరీర్‌లో ముక్కుకు సర్జరీ చేయించుకున్నారని, అది తమ కుటుంబంలో ఒక ముఖ్యమైన మార్పుగా నిలిచిపోయిందని గతంలో పేర్కొన్నారు.
వివరాలు
'ధడక్'తో హీరోయిన్‌గా ఎంట్రీ
శ్రీదేవి మరణించిన కొన్ని నెలలకే 2018లో విడుదలైన 'ధడక్' చిత్రంతో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమయ్యారు.
తన తల్లితో ఉన్న అనుబంధం, కెరీర్ తొలినాళ్లలో ఎదురైన అనుభవాల గురించి జాన్వీ గతంలోనూ పలు సందర్భాల్లో మాట్లాడారు.
అయితే తన ముక్కుకు సర్జరీ చేయించుకున్న తర్వాతే నటిగా తనపై తల్లికి నమ్మకం కలిగిందన్న వ్యాఖ్యలు ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చాయి.