Prabhas: ప్రభాస్ పెళ్లి తర్వాతే నా పెళ్లి.. నవీన్ పొలిశెట్టి సరదా వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన తాజా చిత్రం 'అనగనగా ఒక రాజు' ఈ సంక్రాంతికి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమైంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో హీరో నవీన్ పొలిశెట్టి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తాను అభిమాన హీరోల సినిమాలు థియేటర్‌లో చూసేందుకు వెళ్లేవాడినని, అలాంటి హీరోల సినిమాలతో పాటు ఇప్పుడు తన సినిమా కూడా ఒకేసారి విడుదలవుతుండటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ అనుభూతి తనకు ప్రత్యేకంగా ఉందని పేర్కొన్నారు.
Details
ప్రభాస్ పెళ్లి తర్వాతే నా పెళ్లి
'అనగనగా ఒక రాజు' ప్రమోషన్స్ సందర్భంగా తన పెళ్లి గురించి కూడా నవీన్ సరదాగా స్పందించారు. ప్రభాస్ అన్నయ్య పెళ్లి అయిన మరుసటి రోజు 12గంటలకు నా పెళ్లి ఉంటుందంటూ నవ్వులు పూయించారు. అయితే ప్రభాస్‌తో తనకు ఉన్న స్నేహం ఎంతో గొప్పదని, అది తన జీవితంలో ప్రత్యేకమైన బంధమని తెలిపారు. మూడు సంవత్సరాలుగా ప్రతి సంక్రాంతికి భోగి మంటలు, పతంగ్‌లు, మీనాక్షి చౌదరి తన జీవితంలో కామన్ అయిపోయాయని చెప్పారు. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతిరత్నాలు', 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'—ఈ మూడు చిత్రాలు ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైనవని గుర్తుచేశారు. ఇప్పుడు రాబోయే 'అనగనగా ఒక రాజు' కూడా అంతే సరికొత్తగా ప్రేక్షకులను మెప్పిస్తుందని నవీన్ ధీమా వ్యక్తం చేశారు.
Details
ముందు ప్రభాస్ సినిమా.. తర్వాత చిరు మూవీ
ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలపై కూడా నవీన్ స్పందించారు. ఈ సంక్రాంతికి వస్తున్న చిరంజీవి గారి 'మన శంకర వరప్రసాద్ గారు', ప్రభాస్ గారి 'ది రాజా సాబ్'తో పాటు అన్ని సినిమాలు ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ప్రభాస్ అన్నయ్యతో నేను మంచి స్నేహితులం. మా మధ్య ఎలాంటి పోటీ ఉండదని చెప్పారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా మాట్లాడిన నవీన్ సగటు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కూడా ఇండస్ట్రీలో స్టార్ అవ్వొచ్చని ఎందరికో దారి చూపించిన వ్యక్తి చిరంజీవి. నాలాంటి ఎంతో మందికి ఆయన స్ఫూర్తిగా నిలిచారు.
Details
ఫస్ట్ ప్రభాస్ మూవీనే చూస్తా
అలాంటి గురువుగారి సినిమా విడుదలవుతున్నప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉండదన్నారు. తన సంక్రాంతి సినిమా ప్లాన్‌ను కూడా సరదాగా వెల్లడిస్తూ నేనైతే ఫస్ట్ ప్రభాస్ అన్నయ్య సినిమా చూస్తాను. ఆ తర్వాత చిరంజీవి గారి సినిమాకు వెళ్తాను. అక్కడి నుంచి నా సినిమాకు వెళ్తానని నవీన్ పొలిశెట్టి చెప్పారు.