NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / నాగచైతన్య నెక్స్ట్: బోటు డ్రైవర్ గా రూటు మారుస్తున్నాడు 
    తదుపరి వార్తా కథనం
    నాగచైతన్య నెక్స్ట్: బోటు డ్రైవర్ గా రూటు మారుస్తున్నాడు 
    గీతా ఆర్ట్స్ 2 నిర్మాణంలో నాగచైతన్య సినిమా

    నాగచైతన్య నెక్స్ట్: బోటు డ్రైవర్ గా రూటు మారుస్తున్నాడు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 02, 2023
    04:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇటీవల కాలంలో అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశను మిగిల్చాయి. నాగార్జున ఘోస్ట్, అఖిల్ ఏజెంట్, నాగ చైతన్య థాంక్యూ, కస్టడీ చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి.

    కస్టడీ చిత్రంపై నాగచైతన్య ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. క్రితి శెట్టి హీరోయిన్ గా కనిపించిన ఈ సినిమా, ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది.

    ఈ నేపథ్యంలో అక్కినేని ఫ్యామిలీకి హిట్ కావాలని అభిమానులు అందరూ కోరుకుంటున్నారు. దానికి ముహూర్తం మరికొద్ది రోజుల్లో కుదరబోతుందని వినిపిస్తోంది.

    తాజాగా 2018 సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ అక్కినేని నాగచైతన్య తర్వాతి చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడి చేశాడు.

    Details

    బోటు డ్రైవర్ గా నాగ చైతన్య 

    నాగ చైతన్య తర్వాతి చిత్రం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో ఉండబోతుందని, మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో కథ ఉంటుందని అన్నాడు బన్నీవాసు.

    మత్స్యకారులకు సహాయం చేసే బోటు డ్రైవర్ గా నాగచైతన్య కనిపిస్తాడని, గుజరాత్ లో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని చెప్పేసాడు.

    యాక్షన్, ప్రేమ, ట్విస్టులు కలబోసి భారీ బడ్జెట్ తో సుమారు 60కోట్ల ఖర్చుతో తెరకెక్కించనున్నారట. ఈ సినిమాకు కార్తికేయ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహించనున్నాడని టాక్ వినిపిస్తోంది.

    ఈ సినిమాలో నాగచైతన్య లుక్ చాలా కొత్తగా ఉండనుందట. మరి ఈ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నాగ చైతన్య
    తెలుగు సినిమా

    తాజా

    Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి థాయిలాండ్
    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర
    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి

    నాగ చైతన్య

    శోభిత తో నాగచైతన్య సహజీవనంపై కామెంట్ చేసినట్లుగా వచ్చిన వార్తలను ఖండించిన సమంత సమంత రుతు ప్రభు
    కస్టడీ ట్రైలర్: ముఖ్యమంత్రి కారునే ఆపేసిన కానిస్టేబుల్  తెలుగు సినిమా
    ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే?  తెలుగు సినిమా
    కస్టడీ ట్విట్టర్ రివ్యూ: నాగచైతన్య పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్  సినిమా రిలీజ్

    తెలుగు సినిమా

    మేమ్ ఫేమస్ ట్విట్టర్ రివ్యూ: కొత్తవాళ్ళు చేసారంటే నమ్మలేం అంటున్న నెటిజన్లు  మూవీ రివ్యూ
    రామ్ పోతినేని, బోయపాటి కాంబో: అనుకున్న తేదీ కంటే ముందుగానే రిలీజ్?  సినిమా రిలీజ్
    బాలయ్య, బోయపాటి కాంబో: అఖండ సీక్వెల్ ను పక్కనపెట్టి లెజెండ్ సీక్వెల్ రెడీ?  బాలకృష్ణ
    ప్రభాస్ అభిమానులకు పండగ లాంటి వార్త: ఆదిపురుష్ రిలీజ్ రోజున సలార్ టీజర్ విడుదల?  ప్రభాస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025