LOADING...
NC 24: నాగచైతన్య మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ అనౌన్స్.. మహేశ్ బాబు స్పెషల్ విషెస్ 
నాగచైతన్య మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ అనౌన్స్.. మహేశ్ బాబు స్పెషల్ విషెస్

NC 24: నాగచైతన్య మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ అనౌన్స్.. మహేశ్ బాబు స్పెషల్ విషెస్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2025
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

నాగ చైతన్య (Nagachaitanya) హీరోగా కార్తిక్ దండు రూపొందిస్తున్న సినిమా ప్రస్తుతం #NC24 పేరుతో నిర్మాణంలో ఉందని ఇప్పటికే తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హీరో చైతన్య ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ పోస్టర్‌ను స్టార్ హీరో మహేష్ బాబు (Mahesh Babu) సోషల్ మీడియాలో విడుదల చేశారు. పోస్టర్ రిలీజ్ సందర్భంగా చైతన్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన లుక్ చాలా గొప్పగా ఉందని మహేశ్ పేర్కొన్నారు. మైథలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'వృషకర్మ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.