Loading...
Nagabandham: ఓటీటీలోకి రానున్న 'నాగబంధం'.. స్ట్రీమింగ్ డేట్‌పై క్రేజీ అప్‌డేట్!
ఓటీటీలోకి రానున్న 'నాగబంధం'.. స్ట్రీమింగ్ డేట్‌పై క్రేజీ అప్‌డేట్!

Nagabandham: ఓటీటీలోకి రానున్న 'నాగబంధం'.. స్ట్రీమింగ్ డేట్‌పై క్రేజీ అప్‌డేట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 15, 2026
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల విడుదలకు ముందే ప్రచార చిత్రాలతో సినీ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించిన సినిమా 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్'. దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కించిన ఈ విజువల్ ఫాంటసీ చిత్రంలో 'పెదకాపు' ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటించగా, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా కనిపించారు. వీరితో పాటు జగపతి బాబు, అనసూయ భరద్వాజ్, మహేశ్ మంజ్రేకర్, గరుడ రామ్, జయప్రకాశ్, మురళీ శర్మ, బీఎన్ అవినాష్, రిషభ్ సావ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి సంయుక్తంగా సుమారు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

వివరాలు

ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకుల ఆసక్తి

భారీ అంచనాల మధ్య జూలై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డీసెంట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

కథాపరంగా మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ (VFX), గ్రాండ్ విజువల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి వసూళ్లను నమోదు చేసింది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ విజువల్ వండర్‌ను ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో 'నాగబంధం' డిజిటల్ స్ట్రీమింగ్ తేదీపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. థియేటర్లలో విడుదలకు ముందే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.

వివరాలు

నాలుగు వారాలు తర్వాతే రిలీజ్

అలాగే తెలుగు శాటిలైట్ హక్కులను స్టార్ మా, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల శాటిలైట్ హక్కులను జీ నెట్‌వర్క్ దక్కించుకున్నాయి.

థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాతే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది.

ఈ లెక్కన ఆగస్టు తొలి వారంలో 'నాగబంధం' అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అయితే హిందీ వెర్షన్ మాత్రం థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

అయితే, ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే మేకర్స్ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

ADVERTISEMENT