NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / డైరెక్టర్ ఎవరో రివీల్ చేయకుండా నాని 30వ సినిమా ప్రకటన
    తదుపరి వార్తా కథనం
    డైరెక్టర్ ఎవరో రివీల్ చేయకుండా నాని 30వ సినిమా ప్రకటన
    నాని 30వ సినిమా ప్రకటన వచ్చేసింది

    డైరెక్టర్ ఎవరో రివీల్ చేయకుండా నాని 30వ సినిమా ప్రకటన

    వ్రాసిన వారు Sriram Pranateja
    Dec 31, 2022
    08:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నేచురల్ స్టార్ నాని, తన 30వ సినిమాను వెల్లడించాడు. శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికీ సినిమాలతో ఓ మోస్తారు విజయాన్ని అందుకుని ప్రస్తుతం దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

    మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న దసరా సినిమా నుండి రిలీజైన ధూమ్ ధామ్ దోస్తాన్ అనే పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.

    2023 మార్చిలో దసరా సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది . శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

    ప్రస్తుతం నాని నుండి తన 30సినిమా ప్రకటన వచ్చింది. ఇక్కడ ఆశ్చర్యమేమిటంటే ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరనేది ఇంకా వెల్లడి చేయలేదు.

    నాని 30వ సినిమా

    జనవరి 1వ తేదీన వివరాలు

    వైరా ఎంటర్ టైన్ మెంట్స్ అనే కొత్త బ్యానర్ లో నాని 30వ సినిమా ఉంటుందని ఒక పోస్టర్ వదిలారు. నిర్మాతలుగా మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, డాక్టర్ మూర్తి కేఎస్ ఉన్నట్లు వెల్లడించారు.

    సముద్రపు ఒడ్డున కూర్చుని ఫోన్ వైపు చూస్తున్న నాని ఫోటో పోస్టర్ లో కనిపించింది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి విషయాలు 2023 జనవరి 1వ తేదీన సాయంత్రం 4:05గంటలకు వెల్లడి చేస్తారు.

    నాని 30వ సినిమా ఏ జోనర్ లో ఉండబోతుంది, హీరోయిన్ గా ఎవరు చేస్తున్నారు? డైరెక్టర్ ఎవరు? అనే విషయాలు జనవరి 1 న తెలుస్తుంది .

    మొత్తానికి 2022 చివర్లో నాని నుండి అభిమానులకు మంచి అప్డేట్ అందింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    తెలుగు సినిమా

    2022 రివైండ్: బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడ్డ చిత్రాలు టాలీవుడ్
    మహేష్ తో సినిమాపై శ్రీలీల మౌనం... కారణం అదేనా? టాలీవుడ్
    బాలయ్యను కలిసిన పవన్ కళ్యాణ్.. కారణం అదేనంటూ అభిమానుల గోల టాలీవుడ్
    తెలుగు సినిమాల దెబ్బా.. తమిళ సినిమాలు అబ్బా టాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025