దసరా యుఎస్ ప్రీమియర్స్: కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్లు అందుకున్న నాని
ఈ వార్తాకథనం ఏంటి
నేచురల్ స్టార్ నాని దసరా మూవీ ఈరోజే రిలీజైంది. ఈ సినిమా మీద పెద్ద అంచనాలే పెట్టుకున్నాడు. అందుకు తగినట్టుగానే సినిమాను ప్రమోట్ చేసాడు. దాంతో దసరా సినిమాను చూడాలన్న కోరిక అందరిలోనూ కలిగింది.
దాని ఫలితంగానే అమెరికాలో బుధవారం వేసిన ప్రీమియర్స్ లో సరికొత్త రికార్డ్ సృష్టించాడు నాని. కేవలం ప్రీమియర్స్ తోనే ఏకంగా అరమిలియన్ డాలర్ల వసూళ్ళు అందుకున్నాడు.
నాని సినిమాలకు అమెరికాలో ప్రీమియర్స్ నుండి వచ్చిన కలెక్షన్లలో ఇదే అత్యధికం. మొదటి రోజునే హాఫ్ మిలియన్న్ డాలర్లు సాధించడం అంటే చిన్న విషయం కాదు.
ఈ లెక్కన చూసుకుంటే యుఎస్ లో దసరా కలెక్షన్లు వేరే లెవెల్లో ఉంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
నాని
దసరా లో నట విశ్వరూపం చూపించిన నాని
దసరా సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందనే వస్తున్నట్టుగా వినిపిస్తోంది. ముఖ్యంగా నాని నటన, కీరి సురేష్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉందని చెబుతున్నారు.
ఊరమాస్ అవతారంలో నాని నటన అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ బాగా వచ్చిందని అంటున్నారు.
ప్రస్తుతానికి దసరా సినిమాకు నెగెటివ్ కంటే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్కువగా వస్తోంది. ఈ లెక్కన సినిమాకు మంచి కలెక్షన్లు రావడం ఖాయం అన్నట్టుగా వినిపిస్తోంది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా సినిమాను ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.