దసరా ట్విట్టర్ రివ్యూ: బద్దల్ బాశింగాల్ అయినట్టేనా
నేచురల్ స్టార్ నాని కెరీర్లో మొదటి పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన దసరా, ఈరోజు నుండి థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ యుఎస్ ప్రీమియర్లు పడిపోయాయి. దాంతో ట్విట్టర్ ద్వారా దసరా టాక్ బయటకు వచ్చేసింది. మరి దసరా గురించి ట్విట్టరాటీలు ఏమంటున్నారు? నాని ఎలా చేసాడంటున్నారో చూద్దాం. దసరా సినిమా మొదలవగానే వీర్లపల్లి విలేజ్ లోకి ప్రేక్షకులను తీసుకెళ్ళిపోతారట. ఫస్టాఫ్ చాలా ఇంట్రెస్టింగా సాగిందనీ, ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోయిందని అంటున్నారు. ఇక సెకండాఫ్ లో వచ్చే సీన్స్ ని ముందే ఊహించగలమని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఫస్టాఫ్ తో పోల్చితే సెకండాఫ్ కొంత నెమ్మదించిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
దసరా ట్విట్టర్ రివ్యూ
నెమ్మదించిన దసరా సెకండాఫ్
కాకపోతే చివరి అరగంట మాత్రం అదిరిపోతుందని, నాని విశ్వరూపం కనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. స్నేహం, ప్రేమ, పగ, రాజకీయాల చుట్టూ దసరా కథ తిరుగుతుందని ట్విట్టర్ వేదికగా అభిప్రాయాలు పంచుకుంటున్నారు. మొత్తానికి దసరా సినిమాలో ఎమోషన్స్ హై రేంజ్ లో ఉన్నాయని, సెకండాఫ్ లో కాస్త నెమ్మదించిందనీ, అదొక్కటి తప్పితే సినిమా అంతా బాగుందని అంటున్నారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాని ఇరగ్గొట్టాడనీ, కీర్తి సురేష్ కి మహానటి తర్వాత మంచి పాత్ర దక్కిందనీ అంటున్నారు. నేపథ్య సంగీతం అద్భుతంగా వచ్చిందనీ, ప్రొడక్షన్ డిజైన్ అదిరిపోయిందని చెబుతున్నారు. సినిమాకు పెట్టిన ప్రతీ పైసా స్క్రీన్ మీద కనిపించిందని కామెంట్స్ చేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ బ్రిలియంట్ గా ఉందని అంటున్నారు.