Page Loader
బాలీవుడ్ లో ఎవరితో నటించాలనుందో బయటపెట్టేసిన నాని
దసరా ప్రమోషన్లలో నాని

బాలీవుడ్ లో ఎవరితో నటించాలనుందో బయటపెట్టేసిన నాని

వ్రాసిన వారు Sriram Pranateja
Mar 29, 2023
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

దసరా ప్రమోషన్ల జోరులో ఉన్న నేచురల్ స్టార్ నాని, బాలీవుడ్ మీడియాతో ఎక్కువగా ముచ్చటిస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ తారల్లో ఎవరితో పనిచేయాలనుందో చెప్పేసాడు. బాలీవుడ్ హీరోయిన్స్ లో దీపికా పదుకునే సరసన పనిచేయాలనుందనీ, అవకాశం వస్తే ఆమె పక్కన నటిస్తాననీ, ఆమె అద్భుతమైన నటి అనీ, సరైన కథ దొరికితే ఆమెతో పనిచేస్తాననీ అన్నాడు నాని. అలాగే హీరోల గురించి అడగ్గా, ఆమీర్ ఖాన్ సినిమాలు ఎక్కువ ఇష్టపడతాననీ, ఆయన సినిమాలో నటించాలనుందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, త్రీ ఇడియట్స్, మున్నాభాయ్, సంజు చిత్రాల దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో పనిచేయాలనుందని తన బాలీవుడ్ విష్ లిస్ట్ ఏంటో బయటపెట్టాడు.

దసరా

బ్లాక్ బస్టర్ ఖాయం అంటున్న నాని

నాని కెరీర్లోనే మొదటి పాన్ ఇండియా చిత్రంగా రూపొందింది దసరా. ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో బాగా ప్రమోట్ చేస్తున్నాడు నాని. నవరాత్రులనీ, సాంగ్ లాంచ్ అనీ ఉత్తరాది నగరాలను చుట్టేసాడు. దసరా సినిమా రేపు విడుదల అవుతుంది. అంతకుముందే ఈరోజు రాత్రి అమెరికాలో ప్రీమియర్స్ పడుతున్నాయి. దసరా మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు నాని. మరి నాని అంచనా నిజమవుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించింది. సంతోష్ నారయణన్ సంగీతం అందించారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించారు.