Nani: హీరో కాకముందే నాని పూర్తి స్క్రిప్ట్.. '24' కథ ఎప్పుడో రెడీ!
ఈ వార్తాకథనం ఏంటి
న్యాచురల్ స్టార్ నాని కేవలం హీరోగానే కాకుండా.. తనదైన కథల ఎంపికతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సినిమాల్లో నటుడిగా అడుగుపెట్టడానికి ముందే ఆయన డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. తాజాగా తన పాత రోజులకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని నాని స్వయంగా వెల్లడించారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలోనే ఆయన ఓ పవర్‌ఫుల్ యాక్షన్ స్టోరీని సిద్ధం చేసుకున్నారట. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కయాదు లోహర్ జంటగా నటించిన 'ది ప్యారడైజ్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో నాని తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
వివరాలు
ఆ స్క్రిప్ట్ నా దగ్గరే భద్రంగా ఉంది
ఈ సందర్భంగా తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రోజుల్లోనే సొంతంగా ఓ పూర్తి స్థాయి బౌండ్ స్క్రిప్ట్ రాసుకున్నట్లు వెల్లడించారు.
అంతేకాదు.. ఆ కథకు అప్పట్లోనే '24' అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు నాని తెలిపారు. "ఆ స్క్రిప్ట్ మొత్తం నా దగ్గరే భద్రంగా ఉంది.
పూర్తి స్థాయి యాక్షన్ కథతో దాన్ని సిద్ధం చేసుకున్నాను" అని నాని పేర్కొన్నారు. 'రిటన్ అండ్ డైరెక్టెడ్ బై నాని'గా ఎప్పుడైనా ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తారా? అనే ప్రస్తావన ఇంటర్వ్యూలో వచ్చింది.
దీనిపై స్పందించిన నాని.. ప్రస్తుతం ఆ సినిమాను తానే తెరకెక్కించే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
వివరాలు
ఆశ్చర్యపోతున్న అభిమానులు
అయితే నిజంగా ఆ స్క్రిప్ట్ ఏదైనా ఫిల్మ్ మేకర్‌కు నచ్చి, దాన్ని తెరకెక్కిస్తానంటే మాత్రం చాలా బాగుంటుందని అన్నారు.
తాను 18 ఏళ్ల వయసులో రాసుకున్న ఆ కథను ఇప్పుడు కొన్ని మార్పులు చేసి ఉపయోగించుకోవచ్చని నాని వెల్లడించారు.
ప్రస్తుతం మాత్రం తన దర్శకత్వంలో ఆ సినిమాను తెరకెక్కించడం గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేశారు.
నాని ఇంత చిన్న వయసులోనే ఓ పూర్తి స్థాయి యాక్షన్ కథను రాసి పెట్టుకున్నారనే విషయం తెలియడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
భవిష్యత్తులో ఎప్పుడైనా నాని మెగాఫోన్ పట్టుకుని తాను రాసుకున్న '24' కథను తెరపైకి తీసుకొస్తే చూడాలని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.