Saripoda Sanivaram: సరిపోదా శనివారం ట్రైలర్ విడుదల.. సూర్యను పరిచయం చేసిన నాని
ఈ వార్తాకథనం ఏంటి
సౌత్ సెన్సేషన్ నాని తన రాబోయే తెలుగు చిత్రం సరిపోదా శనివారం ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.
నేడు SJ సూర్య పుట్టినరోజు. ఈ సినిమాలో SJ సూర్య పాత్రను పరిచయం చేయడానికి 'దిస్ ఈజ్ నాట్ ఏ టీజర్' అనే టీజర్ ను విడుదల చేసింది.
ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇంతకముందు వివేక్ ఆత్రేయ నానితో 'అంటే సుందరానికి' సినిమా చేశాడు. ఈ సినిమా నిరాశపరచడంతో ఈ చిత్రంతో స్ట్రాంగ్ కామ్ బ్యాక్ ఇచ్చేలా ప్లాన్ చేసాడు దర్శకుడు.
వివరాలు
క్రూరమైన పోలీసు అధికారిగా సూర్య పాత్ర !
నాని విడుదల చేసిన ఈ వీడియోలోసూర్య పాత్ర క్రూరమైన పోలీసుగా పరిచయం అయ్యింది.
'నీడలాంటి చెడు ఎప్పుడైతే బలపడుతుందో, దానిని ఆపడానికి కొన్ని సమానంగా లేదా మరింత శక్తివంతంగా మంచి పుడుతుంది' అంటూ నాని వాయిస్ ఓవర్ వస్తుంది.
శ్రీకృష్ణుడుగా (నాని) సత్యభామగా (ప్రియాంక మోహన్)తో కలిసి రావణాసురుడు (SJ సూర్య)ను ఎదుర్కోవడానికి వచ్చాడని అర్ధం వచ్చేలా కట్ చేసిన టీజర్ మొదలు నుండి చివరి వరకు ఆధ్యంతం ఆకట్టుకుంది.
ఈ ఇద్దరూ తమ అద్భుతమైన పవర్-ప్యాక్డ్ యాక్టింగ్ తో టీజర్ ను రక్తికట్టించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టీజర్‌పై ఓ లుక్కేయండి!
సరితూగే సమరమే
— Nani (@NameisNani) July 20, 2024
సంహారం తథ్యమే
War is ON #NotATeaser https://t.co/4E912anyuy@iam_SJSuryah 🔥#SaripodhaaSanivaaram pic.twitter.com/gdAF1TAZO3