LOADING...
NANI : 'బ్లడీ రోమియో'గా నాని అవతారం.. అనౌన్స్మెంట్ వీడియో వైరల్!
'బ్లడీ రోమియో'గా నాని అవతారం.. అనౌన్స్మెంట్ వీడియో వైరల్!

NANI : 'బ్లడీ రోమియో'గా నాని అవతారం.. అనౌన్స్మెంట్ వీడియో వైరల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 24, 2026
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేచురల్ స్టార్ నాని తదుపరి చిత్రానికి అధికారికంగా టైటిల్ ఖరారైంది. 'ఓజీ' ఫేమ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు 'బ్లడీ రోమియో' అనే ఆసక్తికరమైన పేరు ఫైనల్ చేశారు. ఈ చిత్రంలో నాని డ్యూయల్ రోల్‌లో కనిపించనుండటం విశేషం. ఒకవైపు సాధారణ చెఫ్‌గా, మరోవైపు నంబర్-1 గ్యాంగ్‌స్టర్‌గా పూర్తిగా భిన్నమైన రెండు పాత్రల్లో ప్రేక్షకులను అలరించబోతున్నారు. నాని కెరీర్‌లో ఇప్పటివరకు చేయని అత్యంత వైవిధ్యమైన పాత్రలుగా ఇవి నిలవనున్నాయి నాని పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ 'బ్లడీ రోమియో' గ్లింప్స్‌ను విడుదల చేశారు. నాని లాంటి నేచురల్ పెర్ఫార్మర్ నుంచి వెస్ట్రన్ స్టైల్ మ్యూజిక్ అప్రోచ్ రావడం అభిమానులకు పెద్ద సర్ప్రైజ్‌గా మారింది.

Details

సంయుక్తంగా నిర్మిస్తున్న నిహారిక ఎంటర్టైన్మెంట్స్, యూనానిమస్ ప్రొడక్షన్స్

ఈ గ్లింప్స్‌లో కనిపించిన విజువల్స్, మ్యూజిక్, స్టైలిష్ ప్రెజెంటేషన్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ప్రత్యేకంగా టీజర్‌లో వినిపించిన 'నం.1గ్యాంగ్‌స్టర్' సాంగ్ ఆకట్టుకుంది. క్లైమాక్స్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదట ఈ సినిమాకు'Guns and Roses' అనే టైటిల్‌ను పరిశీలించినప్పటికీ, చివరకు 'బ్లడీ రోమియో' పేరునే ఫైనలైజ్ చేశారు. అయితే టైటిల్ డిజైన్, థీమ్‌లో మాత్రం 'గన్స్ అండ్ రోజెస్' ఎలిమెంట్స్‌ను హైలైట్ చేసేలా డిజైన్ చేయడం గమనార్హం. నాని సక్సెస్ ట్రాక్‌ను ఈ 'బ్లడీ రోమియో' మరింత బలోపేతం చేస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌తో పాటు యూనానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Advertisement