The Paradise : నాని 'ప్యారడైజ్' ఫస్ట్ లిరికల్ 'ఆయా షేర్' ప్రోమో విడుదల.. మాస్ వైబ్స్ స్టార్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. దసరా వంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి ఆయన చేస్తున్న రెండో చిత్రం ది ప్యారడైజ్. హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాలు, ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. కొద్దిసేపటి క్రితం మేకర్స్ విడుదల చేసిన ప్రోమోలో నాని మాస్ అవతార్ ఆకట్టుకుంది. రఫ్ అండ్ రగ్డ్ లుక్‌లో ఆయన కనిపిస్తూ అభిమానుల్లో ఎక్సైట్మెంట్ పెంచేశారు. ఈ చిత్రానికి తమిళ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఫుల్ సాంగ్‌ను ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నారు.
Details
లుక్ ను పూర్తిగా మార్చేసిన నాని
ఈ పాట నాని పాత్ర స్వభావాన్ని, సినిమాలోని మాస్ ఎనర్జీని ప్రతిబింబించే పవర్‌ఫుల్ అంథెమ్‌గా ఉండబోతోందని సమాచారం. 'దసరా'లో 'చమ్కీల అంగీలేసి' అంటూ అలరించిన నాని, ఈసారి అంతకుమించి మాస్ టచ్‌తో ప్రేక్షకులను ఊపేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం ఆయన తన లుక్‌ను పూర్తిగా మార్చుకోవడం విశేషం. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా ఊర మాస్ క్యారెక్టర్‌లో నాని కనిపించబోతున్నారు. శ్రీకాంత్ ఓదెల ప్రత్యేకమైన రా అండ్ రస్టిక్ విజువల్స్, నాని నటన కలిసివస్తే 'ది ప్యారడైజ్' బాక్సాఫీస్ వద్ద మరోసారి మ్యాజిక్ సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.