Loading...
The Paradise: 'ది ప్యారడైజ్‌' రివ్యూలపై నాని స్పందన.. ఏం చెప్పారంటే?
'ది ప్యారడైజ్‌' రివ్యూలపై నాని స్పందన.. ఏం చెప్పారంటే?

The Paradise: 'ది ప్యారడైజ్‌' రివ్యూలపై నాని స్పందన.. ఏం చెప్పారంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 25, 2026
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

'ది ప్యారడైజ్‌' (The Paradise) సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమతో పాటు వస్తున్న విమర్శలను కూడా స్వాగతిస్తున్నానని హీరో నాని (Nani) అన్నారు. ఆయన కథానాయకుడిగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే 'ది ప్యారడైజ్‌'. ఇందులో కయాదు లోహర్‌ కథానాయికగా నటించగా.. మోహన్‌బాబు కీలక పాత్ర పోషించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు సంబంధించిన రివ్యూలు, ప్రేక్షకుల అభిప్రాయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరో నాని స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ (X) వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు.

వివరాలు

'ట్రోల్స్‌ను కూడా స్వీకరిస్తున్నా'

'ది ప్యారడైజ్‌'పై మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, స్పందన అన్నింటినీ చూశాను. మీరు చూపించిన ప్రేమతో పాటు సరదా ట్రోల్స్‌ను కూడా స్వీకరిస్తున్నాను.

ఈ సినిమాను తమ సినిమాగా ప్రేక్షకులు స్వీకరించిన తీరు నా హృదయానికి హత్తుకుంది. అదే సమయంలో సినీ విమర్శకులు, రివ్యూవర్లు ఎత్తి చూపిన పొరపాట్లు, లోటుపాట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటాను.

మీ అందరికీ కృతజ్ఞతలు. మీకు ప్రత్యేకమైన అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో రక్తం, చెమట చిందించి #TheParadise చిత్రాన్ని తీర్చిదిద్దాం. మీరు ఈ సినిమాను సంబరంగా చేసుకోవచ్చు. విమర్శించవచ్చు.

సినిమాపై మీరు చూపించిన ఉత్సాహం, నాపై కురిపించిన ప్రేమ, ఆప్యాయతకు నాలో కృతజ్ఞత భావాన్ని నింపాయి'' అని నాని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

వివరాలు

తొలిరోజే రూ.88 కోట్ల వసూళ్లు

భారీ అంచనాల మధ్య విడుదలైన 'ది ప్యారడైజ్‌' తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.88 కోట్లు వసూళ్లు చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది.

నాని కెరీర్‌లోనే ఇవి రికార్డు స్థాయి కలెక్షన్స్‌ అని తెలిపింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రివ్యూలు, అభిప్రాయాల నేపథ్యంలో నాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

ADVERTISEMENT