Loading...
Nani: 'ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల..'.. నాని 'ది ప్యారడైజ్‌'లో జానపద పాట

Nani: 'ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల..'.. నాని 'ది ప్యారడైజ్‌'లో జానపద పాట

వ్రాసిన వారు Moogati Shabari
Aug 30, 2026
12:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

'దసరా' సినిమా తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రెండో చిత్రం 'ది ప్యారడైజ్‌'. ఎస్‌ఎల్వీ సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కయాదు లోహర్‌ కథానాయికగా నటిస్తుండగా.. మోహన్‌బాబు, రాఘవ్‌ జుయల్‌, సోనాలి కులకర్ణి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

వివరాలు

సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు..

పీరియాడిక్‌ మాస్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబరు 24న పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో చిత్రబృందం శనివారం సినిమాలోని రెండో పాటను విడుదల చేసింది.

ప్రజల్లో ఇప్పటికే మంచి ఆదరణ పొందిన ''ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల..'' అనే జానపద బాణీకి కొత్త హంగులు జోడించి అనిరుధ్‌ ఈ పాటను స్వరపరిచారు.

వివరాలు

జడల్‌ అనే మాస్‌ లుక్‌లో నాని..

ఈ పాటకు కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించగా.. జంగిరెడ్డి, ప్రభ బంగారిగళ్ల కలిసి ఆలపించారు.

ఆట సందీప్‌ నృత్యరీతులు సమకూర్చారు. పాటలో నాని జడల్‌ అనే మాస్‌ లుక్‌లో కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది.

అలాగే కీర్తి సురేశ్‌తో ఆయన కెమిస్ట్రీ, ఇద్దరూ కలిసి వేసిన హుషారైన స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ప్రస్తుతం 'ది ప్యారడైజ్‌' సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది.

ఈ చిత్రానికి నవీన్‌ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా.. సీహెచ్‌ సాయి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

ADVERTISEMENT