Nani : 'బ్లడీ రోమియో'లో సుజీత్ కొత్త ప్రయోగం… ముగ్గురు సంగీత దర్శకుల ప్లాన్?
ఈ వార్తాకథనం ఏంటి
నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ముందుకెళ్తుండగా, దర్శకుడు సుజీత్ కూడా తన ప్రత్యేకమైన స్టైలిష్ టేకింగ్‌తో 'OG' ద్వారా సాలిడ్ హిట్ కొట్టారు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'బ్లడీ రోమియో' చిత్రం అనౌన్స్‌మెంట్ వచ్చిన దగ్గర నుంచే సినీ వర్గాల్లో భారీ ఆసక్తిని రేపుతోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ విషయంలో సుజీత్ ఓ కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
వివరాలు
ఇద్దరు లేదా ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు
సాధారణంగా ఒక సినిమాకి ఒకే సంగీత దర్శకుడు పనిచేయడం సర్వసాధారణం. కానీ 'బ్లడీ రోమియో' కోసం మాత్రం ఒకరికి పరిమితం కాకుండా, పలువురు సంగీత దర్శకులతో పని చేయాలని సుజీత్ ప్లాన్ చేస్తున్నారట. కథలో ఉండే విభిన్న భావోద్వేగాలు, షేడ్స్‌కు తగ్గట్టుగా ఇద్దరు లేదా ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లను ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్, డ్రామా అంశాలు సమపాళ్లలో ఉండనున్న నేపథ్యంలో, ప్రతి విభాగానికి నిపుణులైన సంగీత దర్శకులను రంగంలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నారట.
వివరాలు
త్వరలోనే అధికారిక ప్రకటన
పాటల కోసం ఒకరు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం మరొకరు లేదా వేర్వేరు జానర్ పాటల కోసం ప్రత్యేకంగా ట్యూన్ మేకర్స్‌ను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నాని సినిమాల్లో సంగీతానికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే ఒకే సినిమాకి ముగ్గురు సంగీత దర్శకులు పని చేయడం ఆయన కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపుగా నిలిచే అవకాశముంది. సుజీత్ సినిమాల్లో మ్యూజిక్, సౌండ్ డిజైనింగ్ స్టైలిష్‌గా ఉండటం తెలిసిందే. అందుకే ఈ మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్ల కాన్సెప్ట్ సినిమాకు మరింత ప్లస్ అవుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.