Venkatesh Trivikram Movie: త్రివిక్రమ్ సినిమాలో వెంకీతో నారా రోహిత్?.. టాలీవుడ్‌లో హాట్ టాక్!
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, మాటల మాంత్రికుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందుతున్న సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కుటుంబ కథలకు కేరాఫ్‌గా నిలిచే వెంకటేష్ ఇమేజ్, చమత్కారమైన హాస్యం, హృదయాన్ని తాకే భావోద్వేగాలు, కుటుంబ బంధాలు-విలువలను సున్నితంగా చూపించే త్రివిక్రమ్ టచ్ కలయికలో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలోకి నారా వారి అబ్బాయి ఎంట్రీ ఇస్తున్నాడనే వార్త సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. 77వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
Details
అధికారిక ప్రకటన వెలువడలేదు
ఈ చిత్రంలో నారా రోహిత్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడని టాక్. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అలా వైకుంఠపురం' సినిమాలో సుశాంత్ పోషించిన కీలక పాత్ర తరహాలోనే, ఈసారి వెంకటేష్‌తో తెరకెక్కుతున్న మూవీలో నారా రోహిత్‌కు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్‌ను డిజైన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నిజమైతే, ఒకే ఫ్రేమ్‌లో వెంకీ మామ - నారా రోహిత్ కలిసి చేసే సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అయితే, ఇప్పటివరకు ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.