NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / నాకు ఆ టైమ్ ఇప్పుడే వచ్చింది.. హిందీ సినిమాపై నయనతార కామెంట్స్
    తదుపరి వార్తా కథనం
    నాకు ఆ టైమ్ ఇప్పుడే వచ్చింది.. హిందీ సినిమాపై నయనతార కామెంట్స్
    కనెక్ట్ మూవీ ప్రమోషన్లలో నయనతార

    నాకు ఆ టైమ్ ఇప్పుడే వచ్చింది.. హిందీ సినిమాపై నయనతార కామెంట్స్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 02, 2023
    01:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయన తార, కనెక్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళం, మళయాలం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసారు.

    ఐతే తెలుగులో రిలీజైన వారం రోజులకు హిందీలో విడుదలైంది ఈ సినిమా. ఈ నేపథ్యంలో బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన నయన తార, హిందీ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

    ఎన్నో ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఇప్పటి వరకు హిందీ సినిమాల్లోకి ఎందుకు రాలేదని ప్రశ్నించగా, ఇన్ని రోజులూ కుదర్లేదని, ప్రస్తుతం ఇది సరైన సమయం అని తెలియజేసింది.

    కనెక్ట్ సినిమాను హిందీలో డబ్ చేసారు. కానీ నయన తర్వాత బాలీవుడ్ ఎంట్రీ షారుఖ్ ఖాన్ జవాన్ తో ఉండనుంది.

    నయన తార

    నా ఫేవరేట్ హిందీ సినిమాలు అవే

    జవాన్ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. కనెక్ట్ మూవీ ప్రమోషన్లలో మాట్లాడిన నయన తార, హిందీ సినిమాలు చాలా చూసానని చెప్పుకొచ్చింది. "మీరు ఏ హిందీ సినిమా పేరైనా చెప్పండి, ఆ సినిమా నేను చూసే ఉంటాను" అని అంది.

    తను చూసిన హిందీ సినిమాలన్నింటిలో కుచ్ కుచ్ హోతా హై అనే సినిమా ఫేవరేట్ అనీ, అలాగే కభీ ఖుషీ కబీ ఘమ్ సినిమా కూడా బాగా ఇష్టమని పేర్కొంది. ఈ రెండు షారుకు ఖాన్ సినిమాలే కావడం విశేషం.

    ఇంకా సినిమాల గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం ఏ భాష నుండి సినిమా వచ్చినా కంటెంట్ బాగుంటే ఆదరిస్తున్నారని, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని సినిమాలను చూస్తున్నారని అంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Nandigam Suresh: టీడీపీ కార్యకర్తపై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు వైసీపీ
    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025