
జవాన్ నుండి నయనతార లుక్ రిలీజ్: గన్ పట్టుకుని నిలబడ్డ లేడీ సూపర్ స్టార్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటిస్తున్న జవాన్ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుందని అందరికీ తెలిసిందే. తాజాగా జవాన్ ప్రివ్యూ వీడియోలో నయనతార కనిపించింది.
ప్రస్తుతం జవాన్ సినిమా నుండి నయనతార లుక్ ని రిలీజ్ చేసారు. బ్లాక్ డ్రెస్, చేతిలో గన్ పట్టుకుని, గాగుల్స్ పెట్టుకుని స్టైలిష్ గా కనిపిస్తోంది.
యాక్షన్ మోడ్ లో ఉన్న నయనతార పోస్టర్ ని రిలీజ్ చేసి, ఆమెకు భయమంటే ఏంటో తెలియదని క్యాప్షన్ తగిలించారు. అంటే ఈ సినిమాలో నయనతార పాత్ర పవర్ ఫుల్ గా ఉండనుందని అర్థమవుతోంది.
అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళంలో రిలీజ్ అవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జవాన్ నుండి నయనతార లుక్ రిలీజ్
Fear has no hold on her! 💥#Nayanthara #JawanPrevue Out Now - https://t.co/CUWX1S7sQ4#Jawan releasing worldwide on 7th September 2023, in Hindi, Tamil & Telugu. pic.twitter.com/h6hw4ppHig
— Red Chillies Entertainment (@RedChilliesEnt) July 17, 2023