LOADING...
The Paradise: యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న నాని మాస్ అంథమ్ 'ఆయా షేర్'.. సోషల్ మీడియాలో సాంగ్ పై నెగిటీవ్ కామెంట్స్..
సోషల్ మీడియాలో సాంగ్ పై నెగిటీవ్ కామెంట్స్..

The Paradise: యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న నాని మాస్ అంథమ్ 'ఆయా షేర్'.. సోషల్ మీడియాలో సాంగ్ పై నెగిటీవ్ కామెంట్స్..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2026
10:38 am

ఈ వార్తాకథనం ఏంటి

నేచురల్ స్టార్ నాని, మాస్ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్'పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన తొలి గీతం 'ఆయా షేర్' (Aaya Sher) విడుదలైన వెంటనే యూట్యూబ్‌లో భారీ వ్యూస్‌ను సాధిస్తూ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ తన ప్రత్యేక శైలిలో శక్తివంతమైన బీట్లు అందించి ఈ పాటను మాస్ రేంజ్‌లో నిలిపారు. ఒకవైపు ఈ గీతం చార్ట్‌బస్టర్‌గా గుర్తింపు పొందుతుండగా, మరోవైపు సోషల్ మీడియాలో కొందరు కావాలనే నెగిటివ్ ప్రచారం చేయడం చర్చకు దారి తీసింది.

వివరాలు 

'ఆయా షేర్' మాస్ అంథమ్

'ఆయా షేర్' వినగానే ఇది ఖచ్చితంగా మాస్ అంథమ్ అనే భావన కలుగుతుంది. కాసర్ల శ్యామ్ అందించిన పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే రా అండ్ రస్టిక్ పదాలు, అనిరుధ్ అందించిన హై ఎనర్జీ మ్యూజిక్ కలిసి సినిమాకి కావాల్సిన మూడ్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి. అయినప్పటికీ, ఈ పాట వినిపించేది మలయాళ గీతంలా ఉందని, తెలుగు పాటలా అనిపించడం లేదని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఈ చిత్రం 1960ల కాలానికి చెందిన పీరియడ్ నేపథ్యంతో, బహుభాషా భావంతో రూపొందుతోంది. అలాంటి కథకు తగినట్టుగానే సంగీతం కూడా ప్రత్యేక శైలిలో ఉండటం సహజం. దీనిని పట్టించుకోకుండా 'మలయాళం సాంగ్' అంటూ విమర్శించడం తగదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వివరాలు 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హుక్ స్టెప్స్

ఇంకా ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే, నాని చేసిన మాస్ డ్యాన్స్ స్టెప్పులపైనా విమర్శలు రావడం. 'దసరా' చిత్రంలో ధరణి పాత్రలో ఊరమాస్ స్టెప్పులతో ఆకట్టుకున్న నాని, ఈ సినిమాలో 'జడలు' అనే పాత్రలో మరింత ఉత్సాహంతో కనిపించారు. సుందన్ మాస్టర్ రూపొందించిన కొరియోగ్రఫీలోని హుక్ స్టెప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయినప్పటికీ, కొందరు కేవలం వ్యతిరేక భావంతోనే ఈ పాటను, నానిని లక్ష్యంగా చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. టాలీవుడ్ నుంచి నాణ్యమైన సినిమా వస్తున్న సమయంలో దాన్ని ప్రోత్సహించాల్సిందిపోయి, ఇలాంటి ప్రతికూల ప్రచారం చేయడం పరిశ్రమకు మేలు చేయదని నాని అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందిస్తున్నారు.

Advertisement