LOADING...
OG: ఓజీ కొత్త వెర్షన్.. మూవీలో 10 నిమిషాల అదనపు ఫుటేజ్‌తో సర్‌ప్రైజ్
ఓజీ కొత్త వెర్షన్.. మూవీలో 10 నిమిషాల అదనపు ఫుటేజ్‌తో సర్‌ప్రైజ్

OG: ఓజీ కొత్త వెర్షన్.. మూవీలో 10 నిమిషాల అదనపు ఫుటేజ్‌తో సర్‌ప్రైజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2025
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం 'ఓజీ' మేకర్స్ సరికొత్త సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తూ ఆసక్తిని పెంచుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఐటెం సాంగ్‌తో సినిమా ప్రోమోషన్‌ను కిక్ ఇచ్చిన టీం, ఇప్పుడు 'ఓజీ' సినిమాను ఇంకా కొత్త రీతిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. దీంతో ఓటీటీలో సరికొత్త రికార్డ్స్ సృష్టించనున్నట్లు నెటిజన్స్ అంచనా వేస్తున్నారు.

Details

 థియేటర్‌లో సందడి, క్రేజ్ తగ్గడం లేదు 

దీపావళి సీజన్ వరకు 'ఓజీ' సినిమా థియేటర్లలో సందడి చేస్తూనే ఉంటుంది. ఇప్పటికే విడుదలై 10 రోజులు గడుస్తున్నప్పటికీ, ఆడియన్స్ క్రేజ్ తగ్గడం లేదు. బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ కొనసాగుతున్నాయి. మొదటి రోజే రూ.154 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా పది రోజుల్లోనే రూ.300 కోట్ల మార్క్ దాటింది. ఇప్పటికే బ్రేకీవెన్‌ను కూడా సాధించింది. రానున్న రోజుల్లో బయ్యర్స్‌కు లాభాలను తెచ్చిపెడుతుంది.

Details

ఓటీటీ కోసం సర్‌ప్రైజ్ ప్లాన్ 

సమీప భవిష్యత్‌లో 'ఓజీ' సినిమా ఓటీటీలోకి రానుంది. మేకర్స్ అక్టోబర్ ఎండింగ్‌లో నెట్‌ఫ్లిక్స్ ద్వారా సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఓటీటీ రిలీజ్ సందర్భంగా ప్రేక్షకులకు ప్రత్యేక సర్‌ప్రైజ్ కూడా ఉంది. సెన్సార్ కోసం కట్ చేసిన దాదాపు 10 నిమిషాల ఫుటేజ్‌ను అదనంగా రిలీజ్ చేయనున్నారు. పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ వంటి సన్నివేశాలు ఆడియన్స్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.