Page Loader
Ram Charan: త్రివిక్రమ్ కాదు.. నెక్ట్స్ బాలీవుడ్ డైరెక్టర్‌తో రామ్‌చరణ్ మూవీ ప్లాన్?
త్రివిక్రమ్ కాదు.. నెక్ట్స్ బాలీవుడ్ డైరెక్టర్‌తో రామ్‌చరణ్ మూవీ ప్లాన్?

Ram Charan: త్రివిక్రమ్ కాదు.. నెక్ట్స్ బాలీవుడ్ డైరెక్టర్‌తో రామ్‌చరణ్ మూవీ ప్లాన్?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 17, 2025
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ లేటెస్ట్‌ లైనప్‌ చుట్టూ రోజు రోజుకూ కొత్త కథనాలు వైరలవుతున్నాయి. ప్రస్తుతం ఆయన డైరెక్టర్‌ బుచ్చిబాబుతో కలిసి 'పెద్ది' సినిమాతో బిజీగా ఉన్నప్పటికీ, తర్వాతి ప్రాజెక్ట్‌పై ఎప్పటికప్పుడు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్‌, సందీప్‌ రెడ్డి వంగా వంటి దర్శకుల పేర్లు చర్చలోకి వచ్చినా, తాజాగా బాలీవుడ్‌ దర్శకుడు ఒకరి పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో చరణ్‌ తదుపరి సినిమా ఎవరితో అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో రామ్‌ చరణ్‌ సినిమా ఉంటుందనే వార్తలు ఇటీవల పెద్ద ఎత్తున వైరల్‌ అయ్యాయి.

Details

అధికారికంగా స్పందించిన మూవీ టీం

కానీ మైత్రి మూవీస్‌ ప్రొడ్యూసర్‌ నాగవంశీ త్రివిక్రమ్‌ ప్రాజెక్టులపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ వద్ద విక్టరీ వెంకటేశ్‌, ఎన్టీఆర్‌ ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయని చెప్పారు. దీంతో చరణ్-త్రివిక్రమ్‌ సినిమా కథనాలు కేవలం పుకార్లే అని తేలిపోయింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు బాలీవుడ్‌ డైరెక్టర్‌ నిఖిల్‌ నాగేశ్‌ భట్‌తో రామ్‌ చరణ్‌ సినిమా చేస్తున్నారనే వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి. 'కిల్‌' అనే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్‌.. రామ్‌ చరణ్‌ కోసం ఓ పవర్‌ఫుల్‌ కథ రెడీ చేశారన్నది టాక్‌. నిజానికి వీరిద్దరి కాంబినేషన్‌పై చాలా కాలంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ఎవరూ అధికారికంగా స్పందించలేదు.

Details

ఆసక్తిగా ఎదురుచూస్తున్నఫ్యాన్స్

ప్రస్తుతం చరణ్‌ 'పెද්ది' చిత్రంపై పూర్తిగా దృష్టి పెట్టారు. మల్టీ స్పోర్ట్స్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్గా నటిస్తోంది. ఉత్తరాంధ్ర సెట్టింగులో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్‌ తర్వాత చరణ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌తో సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించడమూ జరిగింది. గతంలో బాలీవుడ్‌ డైరెక్టర్‌ అపూర్వ లాఖియా దర్శకత్వంలో జంజీర్‌ చేసిన చరణ్‌కి అన్‌ఫార్చునేట్‌గా డిజాస్టర్ ఎదురైంది. అలాంటి అనుభవం ఉన్నా కూడా మరోసారి బాలీవుడ్‌ డైరెక్టర్‌ నిఖిల్‌ నాగేశ్‌ భట్‌తో సినిమా చేయాలని చరణ్‌ ముందుకు వెళ్తారా లేదా అన్నది చూడాల్సిందే. ప్రస్తుతం మెగా అభిమానులంతా ఆసక్తిగా ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.