Page Loader
 Peddarayudu: ఎన్టీఆర్‌, బాల‌కృష్ణ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కాల్సిన సినిమాలో.. ర‌జ‌నీకాంత్ ట్విస్ట్‌తో కాంబో మిస్ - అస‌లేం జ‌రిగిందంటే?
ఎన్టీఆర్‌, బాల‌కృష్ణ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కాల్సిన సినిమాలో.. ర‌జ‌నీకాంత్ ట్విస్ట్‌తో కాంబో మిస్ - అస‌లేం జ‌రిగిందంటే?

 Peddarayudu: ఎన్టీఆర్‌, బాల‌కృష్ణ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కాల్సిన సినిమాలో.. ర‌జ‌నీకాంత్ ట్విస్ట్‌తో కాంబో మిస్ - అస‌లేం జ‌రిగిందంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 29, 2025
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

మోహన్‌బాబు సినీ ప్రస్థానంలో అత్యంత విజయవంతమైన సినిమాలలో పెదరాయుడు ఒకటి. ఈ చిత్రం 1995లో విడుదలై అప్పట్లోనే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ద్విపాత్రాభినయంలో మోహన్‌బాబు విశేష నటన కనబరిచారు. అలాగే, అతిథి పాత్రలో రజనీకాంత్ నటించి ఆయన చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమాకు అద్భుతమైన పాటలతోపాటు కమర్షియల్ అంశాలు బలంగా ఉండటంతో, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబపెదరాయుడు సినిమా ముందు వరుసగా మూడు సినిమాలు అపజయం చెందడంతో మోహన్‌బాబు కొంత ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఈ చిత్రంలో అతిథి పాత్ర చేయడమే కాకుండా నిర్మాణంలో కూడా రజనీకాంత్ మోహన్‌బాబుకు ఆర్థికంగా తోడ్పాటునందించారు. ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించగా, సౌందర్య, భానుప్రియ కథానాయికలుగా నటించారు. సంగీత దర్శకుడు కోటి అందించిన సంగీతం కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ట్టింది.

వివరాలు 

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన నాట్ట‌మై

ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించిన నాట్టమై కు తెలుగు రీమేక్‌గా రూపొందడం విశేషం.

వివరాలు 

సినిమా వెనుకనున్న అసలు ప్రణాళిక: ఎన్టీఆర్, బాలకృష్ణతోనే కావాలనుకున్న నిర్మాతలు 

సుందరకాండ, కొండపల్లి రాజా వంటి సినిమాలను నిర్మించిన అనుభవజ్ఞుడైన నిర్మాత కేవీవీ సత్యనారాయణ, నాట్టమై చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు.

వివరాలు 

రజనీకాంత్ ఫోన్ కాల్‌తో కథ మలుపు 

అయితే ఈ ఒప్పందానికి సంతకాలు చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో, రజనీకాంత్ స్వయంగా ఆర్‌బీ చౌదరికి ఫోన్ చేసి, నాట్టమై రీమేక్ హక్కులు తనకు కావాలని అభ్యర్థించారు.

వివరాలు 

ఆర్థికంగా మోహన్‌బాబుకు రజనీకాంత్ సాయం 

పెదరాయుడు సినిమా ముందు వరుసగా మూడు సినిమాలు అపజయం చెందడంతో మోహన్‌ బాబు కొంత ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారు.