LOADING...
Kantara Chapter 1: 'కాంతార 1' టీమ్‌కు ఎన్టీఆర్‌ అభినందనలు
'కాంతార 1' టీమ్‌కు ఎన్టీఆర్‌ అభినందనలు

Kantara Chapter 1: 'కాంతార 1' టీమ్‌కు ఎన్టీఆర్‌ అభినందనలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 02, 2025
02:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిషబ్‌ శెట్టి దర్శకత్వం వహించి నటించిన 'కాంతార చాప్టర్-1' ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణను పొందుతోంది. ఈ విజయం చూసి తనకెంతో ఆనందంగా ఉందంటూ జూనియర్ ఎన్టీఆర్‌ (NTR) ప్రత్యేకంగా స్పందించారు. సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ రిషబ్‌ శెట్టి ప్రతిభను ప్రశంసించారు. ''కాంతార చాప్టర్‌ 1' ఘనవిజయాన్ని అందుకున్నందుకు మొత్తం టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా రిషబ్‌ శెట్టి తన ఆలోచనలతో నటుడిగా, దర్శకుడిగా అద్భుతమైన సృజనాత్మకతను చూపించారు. ఆయన ప్రతిభపైన నమ్మకంతో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువెళ్లిన హోంబలే ఫిల్మ్స్‌తో పాటు చిత్రబృందంలోని ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు''అని పోస్ట్‌లో రాసుకొచ్చారు.

వివరాలు 

 'కాంతార' సినిమాకు ప్రీక్వెల్‌గా ఈ 'కాంతార చాప్టర్‌ 1' 

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన 'కాంతార చాప్టర్‌ 1' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తారక్‌ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఆ వేదికపైనే ఆయన మాట్లాడుతూ - ''ఈ స్థాయిలో 'కాంతార'ను తీర్చిదిద్దడం రిషబ్‌ శెట్టికి మాత్రమే సాధ్యమయ్యే పని'' అని పేర్కొన్నారు. 2022లో విడుదలైన 'కాంతార' సినిమాకు ప్రీక్వెల్‌గా ఈ 'కాంతార చాప్టర్‌ 1' రూపొందింది. భారీ అంచనాల మధ్య రిలీజ్‌ అయిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుని థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఓ ఆధ్యాత్మిక అనుభూతితో బయటకు వస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం సినిమా దృశ్యాలు సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అవుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్