HBD NTR: ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా విడుదలైన'డ్రాగన్' ఫస్ట్ గ్లింప్స్
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వేళ ఎట్టకేలకు భారీ ప్రకటన వెలువడింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ కొత్త చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా అర్ధరాత్రి విడుదలైన ఈ ఫస్ట్ గ్లింప్స్'కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇదే సమయంలో చిత్రానికి 'డ్రాగన్' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఏకంగా 4 నిమిషాల 28 సెకన్ల నిడివి గల వీడియోను అభిమానులతో పంచుకున్నారు
వివరాలు
'లూగర్' అనే భయంకరమైన పాత్రలో ఎన్టీఆర్
ఈ గ్లింప్స్ ద్వారా 'డ్రాగన్' ప్రపంచాన్ని, అందులోని ప్రధాన పాత్రలను దర్శకుడు ప్రశాంత్ నీల్ పరిచయం చేశారు. 1967 కాలం నాటి నల్లమందు తోటలు, ప్రమాదకర మాదకద్రవ్య ముఠాలు, ఆఫ్ఘన్ వ్యాపార సంస్థల చుట్టూ కథ తిరుగుతున్నట్లు చూపించారు. ప్రపంచవ్యాప్తంగా నల్లమందు సాగుకు పేరుగాంచిన ఆఫ్ఘనిస్థాన్, గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతాలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లు స్పష్టమైంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ 'లూగర్' అనే భయంకరమైన పాత్రలో కనిపించనున్నారు. ఆఫ్ఘన్ వ్యాపార సంస్థకు ప్రధాన హంతకుడిగా ఆయన పాత్రను పరిచయం చేశారు. సన్నగా, కఠినంగా కనిపించే రూపంతో పాటు గంభీర స్వరంతో ఎన్టీఆర్ ఆకట్టుకున్నారు.
వివరాలు
రఘువీర్ రాథోడ్ పాత్రలో అనిల్ కపూర్
"దేవుడు నాకు ఒక గొప్ప వరం ఇచ్చాడు. తుపాకీ గుండును పేల్చిన వెంటనే అన్నింటినీ మరిచిపోతాను. నేను చంపిన వాళ్ల ముఖాలు నా కలల్లో కనిపించవు. ఇంకా మిగిలిన శత్రువులే నా కళ్ల ముందుంటారు. పొరపాటున కూడా నువ్వు నా కలలోకి రావద్దు" అంటూ చెప్పిన సంభాషణ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. మరోవైపు మాదకద్రవ్య ముఠాలను అడ్డుకునే నార్కోటిక్స్ విభాగాధిపతి రఘువీర్ రాథోడ్ పాత్రలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కనిపించనున్నారు. అలాగే మలయాళ నటుడు బిజూ మీనన్, అశుతోష్ రాణా, అన్షుమన్ పుష్కర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. కథానాయికగా రుక్మిణి వసంత్ నటిస్తోంది.
వివరాలు
ఈ సినిమాకూ డార్క్ థీమ్
ప్రశాంత్ నీల్ తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాకూ కూడా డార్క్ థీమ్‌ను ఎంచుకున్నారు. రవి బస్రూర్ నేపథ్య సంగీతం, భువన్ గౌడ విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఈ గ్లింప్స్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసిందనడంలో సందేహం లేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్
#NTRNeel is the first colour movie from #PrasanthNeel
— Milagro Movies (@MilagroMovies) May 19, 2026
confirmed long back by @MilagroMovies.
Now everyone has witnessed it.#Dragon #NTR pic.twitter.com/tpOAiHHakY