Official: వచ్చే సంక్రాంతికి..బ్లాక్ బస్టర్ శతమానం భవతికి సీక్వెల్
ఈ వార్తాకథనం ఏంటి
ఏడు సంవత్సరాల క్రితం సంక్రాంతి చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా "శతమానం భవతి".
సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ సినిమాకి 1 జాతీయ అవార్డు, 6 నంది అవార్డులు వచ్చాయి.
ఇక నేడు సంక్రాంతి సందర్భంగా నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, తెలుగు ప్రేక్షకుల కోసం ఓ ప్రకటనను విడుదల చేసింది.
త్వరలోనే శతమానం భవతికి సీక్వెల్ తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ఈ చిత్రం 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాకి సంబంధించి నటీనటుల గురించిన వివరాలను వెల్లడించలేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చేసిన ట్వీట్
7 years ago, #ShathamanamBhavathi Celebrated Sankranthi with its timeless magic ❤️
— Sri Venkateswara Creations (@SVC_official) January 15, 2024
Now, get ready for another chapter unfolding with even more enchantment in 2025! 😍
More Details loading soon 😉
వచ్చే సంక్రాంతికి కలుద్దాం ❤️🔥 pic.twitter.com/yJT5xump4Q