LOADING...
OG: 'ఓజీ' మరో సంచలన రికార్డు.. కానీ మేకర్స్ సైలెన్స్‌పై నెటిజన్ల చర్చ
'ఓజీ' మరో సంచలన రికార్డు.. కానీ మేకర్స్ సైలెన్స్‌పై నెటిజన్ల చర్చ

OG: 'ఓజీ' మరో సంచలన రికార్డు.. కానీ మేకర్స్ సైలెన్స్‌పై నెటిజన్ల చర్చ

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2025
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా 'ఓజీ' బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. విడుదలైన కేవలం పది రోజుల్లోనే ఈ చిత్రం 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా నిలిచిందని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రక్రియలో, సంక్రాంతి సందర్భంగా విడుదలై రూ.303 కోట్ల గ్రాస్ రాబట్టిన వెంకటేశ్‌ సినిమా సంక్రాంతికి వస్తున్నాం రికార్డును ఓజీ అధిగమించింది. ఈ విజయాన్ని గుర్తు చేసుకుంటూ, చిత్రబృందం సోషల్ మీడియాలో ఒక పవర్‌ఫుల్ పోస్టర్ విడుదల చేసింది. చేతిలో కటానా పట్టుకుని పవన్ కళ్యాణ్ స్టైలిష్‌గా నడుస్తున్న ఈపోస్టర్‌కు 'అలలిక కదలక భయపడేలే... ప్రళయం ఎదురుగా నిలబడేలే' అనే లైన్ జోడించారు.

Details

ఇప్పటికే రూ.303 కోట్లకు పైగా వసూలు

దీంతో 'ఓజీ' ఇప్పటికే రూ.303 కోట్లకు పైగా వసూలు చేసినట్లు స్పష్టమవుతోంది. అయితే ఈసారి మేకర్స్ కలెక్షన్ల సంఖ్యతో కూడిన పోస్టర్‌ను కాకుండా కేవలం రికార్డు బ్రేక్ చేసిందని మాత్రమే ప్రకటించడం గమనార్హం. మొదటి రోజు రూ.154 కోట్లు, నాలుగు రోజుల్లో రూ.252 కోట్లు సాధించినట్లు స్పష్టమైన పోస్టర్లు రిలీజ్ చేసిన చిత్రబృందం, ఈసారి మాత్రం కలెక్షన్ల ఫిగర్స్ చెప్పకుండా సైలెంట్‌గా ఉండటం నెటిజన్లలో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. భారీ అంచనాలు, బ్లాక్‌బస్టర్ టాక్ ఉన్నప్పటికీ అసలు వసూళ్ల వివరాలు ఎందుకు దాచిపెడుతున్నారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇక సినీ వర్గాల్లో మాత్రం 'ఓజీ'పై నెలకొన్న హైప్‌కు, పది రోజుల్లో ప్రకటించిన వసూళ్లకు మధ్య కొంత వ్యత్యాసం కనిపిస్తోందని విశ్లేషణలు మొదలయ్యాయి.