LOADING...
OG Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ఓజీ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ఓజీ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OG Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ఓజీ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 18, 2025
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఓజీ' (They Call Him OG) త్వరలోనే ఓటీటీలోకి రానుంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయల పైగా వసూలు చేసి సూపర్ హిట్‌గా నిలిచింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన వింటేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, స్టైలిష్ లుక్స్, తమన్ సంగీతం, సుజీత్ టేకింగ్ వంటి అంశాలు సినిమా హైలైట్స్‌గా నిలిచాయి. తాజాగా ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక 'నెట్‌ఫ్లిక్స్'‌లో అక్టోబర్ 23 నుండి స్ట్రీమింగ్ కానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.