LOADING...
OG: హాట్ కేకుల్లా 'ఓజీ' టికెట్స్ సేల్స్ .. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే సంచలన రికార్డు 
హాట్ కేకుల్లా 'ఓజీ' బుకింగ్స్ .. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే సంచలన రికార్డు

OG: హాట్ కేకుల్లా 'ఓజీ' టికెట్స్ సేల్స్ .. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే సంచలన రికార్డు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 23, 2025
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ హైప్ నెలకొన్నది. సెప్టెంబర్ 25న మూవీ థియేటర్లలో విడుదల కానుంది. అయితే రేపు రాత్రి ప్రీమియర్ షోలు కూడా మొదలుకానున్నాయి. ప్రీమియర్ షోల కోసం టికెట్ బుకింగ్స్ మొదట ఓపెన్ కాలేదు కానీ 25 నుంచి సాధారణ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రెండు రోజుల ముందే టికెట్లన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి. ఫలితంగా, కలెక్షన్లలో భారీ వసూలు ముందే అంచనా వేయబడుతోంది. హైదరాబాద్‌లో మాత్రమే 'ఓజీ' సినిమాకు అన్ని మాల్స్, సింగిల్ స్క్రీన్లు, మల్టిప్లెక్స్‌లలో 550కి పైగా షోలు ఏర్పాటు చేయబడ్డాయి. వీటిలో అన్ని షోలు ముందే హౌస్‌ఫుల్‌గా మారాయి.

Details

నాలుగు రోజులపాటు హౌస్‌ఫుల్ షోలు

బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా టికెట్లు సుమారు కొన్ని నిమిషాల్లోనే అమ్ముడవ్వడం విశేషం. హైదరాబాద్‌లో ఈ స్థాయిలో టికెట్ డిమాండ్ ఉండటం, తెలుగు రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో OG హైప్ ఎంత ఉంటుందో అర్థమవుతుంది. సినిమా ఫ్లాష్‌లో హైప్ చూసి మరిన్ని స్క్రీన్స్‌ కూడా OG కోసం యాడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రీమియర్ షోల బుకింగ్స్ రేపు ప్రారంభమవుతాయి. దసరా హాలిడేస్, వీకెండ్ ఉండటం వలన OG సినిమాకు నాలుగు రోజులపాటు హౌస్‌ఫుల్ షోలు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే 50 కోట్లకు పైగా వసూళ్లు నమోదవుతున్నాయి.