Oscar Awards: 98వ ఆస్కార్ అవార్డ్స్ ప్రారంభం.. హోస్ట్‌గా కోనన్ ఓబ్రియన్, హైలైట్‌గా ప్రియాంక
ఈ వార్తాకథనం ఏంటి
యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రతిష్ఠాత్మక సినీ వేడుకకు లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్ వేదికైంది. 98వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి హాలీవుడ్ ప్రముఖ కమెడియన్ కోనన్ ఓబ్రియన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ వేడుకలో ఓ విజేతకు ప్రియాంక చోప్రా ప్రెజెంటర్‌గా అవార్డు అందించనున్నారు. ఇక 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్', 'సిన్నర్స్' సినిమాలు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
వివరాలు
ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నసినిమాలు ఇవే..
ఉత్తమ చిత్రం: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఉత్తమ దర్శకుడు: పాల్ థామస్ అండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) ఉత్తమ నటుడు: మైఖేల్ బి జోర్డాన్ (సిన్నర్స్) ఉత్తమ నటి: జెస్సీ బక్లీ (హామ్నెట్) ఉత్తమ సహాయ నటుడు: సీన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) ఉత్తమ సహాయ నటి: ఎమీ మాడిగన్ (వెపన్స్) ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: కెపాప్ డిమాన్ హంటర్స్ ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ది గర్ల్ హు క్రైడ్ పెరల్స్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: ఫ్రాంకెన్‌స్టైయిన్ ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: ఫ్రాంకెన్‌స్టైయిన్
వివరాలు
ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నసినిమాలు ఇవే..
ఉత్తమ క్యాస్టింగ్: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది సింగర్స్, టూ పీపుల్ ఎక్ఛ్సేంజ్ సలైవా ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: సిన్నర్స్ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: మిస్టర్. నోబడీ ఎగనెస్ట్ పుతిన్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ఆల్ ది ఎంప్టీ రూమ్స్ ఉత్తమ సౌండ్: ఎఫ్ 1 ఉత్తమ ఎడిటింగ్: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఉత్తమ సినిమాటోగ్రఫీ: సిన్నర్స్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్: అవతార్ ఫైర్ అండ్ యాష్
వివరాలు
ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నసినిమాలు ఇవే..
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: సెంటిమెంటల్ వ్యాల్యూ (నార్వే) ఉత్తమ ఒరిజినల్ సాంగ్: గోల్డెన్ (కేపాప్ డిమాన్ హంటర్స్) ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఉత్తమ ఒరిజినల్ స్కోర్: సిన్నర్స్ ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: ఫ్రాంకెన్‌స్టైయిన్