ఆస్కార్ అవార్డ్స్: అత్యధిక నామినేషన్లు పొందిన చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది
95వ ఆస్కార్ అవార్డుల్లో అత్యధిక నామినేషన్లు పొందిన ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి మొదలగు విభాగాలు సహా మొత్తం 11విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లలో నిలిచింది ఈ చిత్రం. ప్యారలాల్ యూనివర్స్ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా, ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం పది మిలియన్లతో తెరకెక్కిన ఈ చిత్రం, ఏకంగా 100 మిలియన్లకు పైగా కలెక్షన్లు సాధించింది. డేనియల్ క్వాన్, డేనియల్ సెనెర్ట్ అనే ఇద్దరు దర్శకులు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆస్కార్ అవార్డుల ప్రధాన ఉత్సవానికి రెండు రోజుల ముందు ఓటీటీలో ఈ సినిమా ప్రత్యక్షం కావడం విశేషం.