ఓటీటీ: యాంగర్ టేల్స్ రివ్యూ
వెంకటేష్ మహా, సుహాస్, తరుణ్ భాస్కర్, మడోన్నా సెబాస్టియన్, బిందు మాధవి నటించిన యాంగర్ టేల్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మార్చ్ 9వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతోంది. ఇదొక ఆంథాలజీ సిరీస్. ఇందులో నాలుగు కథలున్నాయి. మొదటగా వెంకటేష్ మహా కథ విషయానికి వస్తే, ఒక స్టార్ హీరోకు అభిమానిగా ఉండి బెనిఫిట్ షోల కోసం పోరాడుతుంటాడు. ఈ కథలోనే లోకల్ డాన్ గా కనిపిస్తాడు సుహాస్. ఫ్యాన్ వార్ అనేది అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇక రెండో కథ బట్టతల మనిషి. బట్టతల ఉండడం వల్ల అందరూ తక్కువ చేసి చూస్తారు. దాంతో కోపం పెరిగిపోయి ఏం చేసాడనేదే అతని కథ.
రెండు కథలు అలా, రెండు కథలు ఇలా
ఇక బిందు మాధవి క్యారెక్టర్ ఏమో, నిద్రకోసం కోపం తెచ్చుకుంటుంది. పక్కింటి వాళ్ళ వల్ల తన నిద్రకు డిస్టర్బ్ అవుతుండడంతో ఆమెలో కోపం పెరుగుతుంది. చివరగా మడోన్నా సెబాస్టియన్ పాత్రకు మాంసం అంటే చాలా ఇష్టం. కానీ మాంసం తినని తరుణ్ భాస్కర్ ని పెళ్ళి చేసుకుని అక్కడ తిండి విషయంలో కోపం తెచ్చుకుని ఎలాంటి ఇబ్బంది పడిందనేదే ఆమె కథ. పర్ఫార్మెన్సెస్ పరంగా చూసుకుంటే అందరూ బాగా చేసారు. ప్రభల తిలక్ దర్శకత్వం బాగుంది. కాకపోతే మేజర్ గా వెంకటేష్ మహా కథ, బిందు మాధవి కథ ఆసక్తిగా ఉంటుంది. మిగతా రెండు కథలు ఫర్వాలేదనిపిస్తాయి. వారాంతంలో ఒకసారి హ్యాపీగా చూసేయొచ్చు.