ఓటీటీ: మార్చ్ లో రిలీజ్ అవుతున్న వెంకటేష్ రానా నాయుడు, తరుణ్ భాస్కర్ యాంగర్ టేల్స్
మార్చ్ లో బాక్సాఫీసు వద్ద సందడి చేయడానికి చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి. అదే మాదిరిగా ఓటీటీలో వినోదం పంచడానికి కొన్ని సిరీస్ లు వచ్చేస్తున్నాయి. అందులో చెప్పుకోదగ్గ తెలుగు సిరీస్ లు రెండు ఉన్నాయి. ఒకటి రానా నాయుడు, రెండోది యాంగర్ టేల్స్. రానా నాయుడు: విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్న ఈ సిరీస్ ని 2013లో వచ్చిన రే డేనోవన్ అనే సిరీస్ కి రీమేక్ గా తెరకెక్కించారు. తండ్రీ కొడుకులుగా వెంకటేష్, రానా కనిపించనున్నారు. హిందీ దర్శకులు రూపొందించిన ఈ సిరీస్, తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. మార్చ్ 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవనున్న యాంగర్ టేల్స్
యాక్టర్ సుహాస్, దర్శకుడు తరుణ్ భాస్కర్, బిందుమాధవి, మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాంగర్ టేల్స్ అనే సిరీస్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మార్చ్ 9వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతుంది. కోపం కారణంగా కథలోని నాలుగు ప్రధాన పాత్రల జీవితాలు ఏ విధంగా మలుపు తిరిగాయన్నదే కథ అని మేకర్స్ ఇదివరకే వెల్లడి చేసారు.ఇందులోని పాత్రలు నిజ జీవితంలోని పాత్రల్లాగా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటాయని మేకర్స్ తెలియజేసారు. ఇందులో కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా, యాక్టర్ సుహాస్.. ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తారు. ప్రభల తిలక్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ని యాక్టర్ సుహాస్, శ్రీధర్ రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.