This week ott releases: ఈ వీకెండ్ ఓటీటీ సందడి.. 20కుపైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రెడీ!
ఈ వార్తాకథనం ఏంటి
ఈ వారం ఓటిటి ప్రేక్షకులకు విభిన్నమైన కథలు, ఆసక్తికరమైన చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో పాటు యాక్షన్, ప్రేమకథ, స్పోర్ట్స్, థ్రిల్లర్ జానర్లలోని సినిమాలు ప్రముఖ ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వైవిధ్యమైన కథలు, పాత్రలను ఎంచుకునే నటుడు సత్యదేవ్ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం 'రావు బహదూర్'. వెంకటేశ్ మహా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో దీపా థామస్ కథానాయికగా నటించారు. భిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
వివరాలు
కీలక పాత్రలు పోషించిన రమ్యకృష్ణ, యోగిబాబు
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన 'గట్టా కుస్తీ-2' కూడా డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
చెల్ల అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమా కూడా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులో ఉంది. వరలక్ష్మీ శరత్ కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లర్ 'పోలీస్ కంప్లైంట్'కు సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు.
'రియాక్షన్ ఆఫ్ కర్మ' అనే విభిన్న కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, కన్నడ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది.
వివరాలు
ఆహాలో స్ట్రీమింగ్
'మంజుమ్మల్ బాయ్స్'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన 'బాలన్ - ది బాయ్' కూడా ఓటీటీలోకి వచ్చింది.
చందు సలీమ్ కుమార్, టొవినో థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేటర్లలో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని, ఇప్పుడు జీ5 వేదికగా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
యువ నటుడు హర్షిత్, స్మేహ మణిమేఖలై జంటగా నటించిన ప్రేమకథా చిత్రం 'దీవాన' కూడా డిజిటల్ ప్రేక్షకులను అలరిస్తోంది.
శ్రీకాంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో యువతను ఆకట్టుకోగా, ప్రస్తుతం 'ఆహా' వేదికలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులకు మరో మంచి ఎంపికగా నిలుస్తోంది.
వివరాలు
ఓటీటీలో అలరించే మరికొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
ది ఐదహో మర్డర్స్: కాలేజ్ నైట్ మేర్:సీజన్1 (వెబ్‌సిరీస్) ఇంగ్లిష్/తెలుగు
ఏ ప్రైవేట్ లైఫ్ (మూవీ) ఇంగ్లిష్
జియో హాట్‌స్టార్
హార్ట్ బీట్:సీజన్3 (వెబ్‌సిరీస్) తమిళ్/తెలుగు
చిన్ని చిన్ని ఆశ (మూవీ) మలయాళం/తెలుగు
ది డెవిల్ వేర్స్ ప్రద2 (మూవీ) ఇంగ్లిష్
జీ5
అబ్జెక్షన్ మైలార్డ్ (వెబ్‌సిరీస్) తెలుగు
భవనం గగనం (మూవీ) కన్నడ
హై జవానీతో ఇష్క్ హోనా హై (మూవీ) హిందీ
ఆహా
ఆజాదీ501 (మూవీ) తెలుగు
హరి చంద్రకాంత (వెబ్‌సిరీస్) తెలుగు
ఈటీవీ విన్ సెకండ్ మ్యారేజ్ (మూవీ) తెలుగు