Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు.. సంక్రాంతి 'బాస్ బస్టర్': అల్లు అర్జున్
ఈ వార్తాకథనం ఏంటి
ఈ సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమా కేవలం బ్లాక్‌బస్టర్ మాత్రమే కాదని, నిజమైన సంక్రాంతి 'బాస్ బస్టర్' అని అగ్ర హీరో అల్లు అర్జున్ ప్రశంసించారు. తాజాగా ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన నేపథ్యంలో చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ బన్ని ప్రత్యేక పోస్ట్ చేశారు. 'బాస్ ఈజ్ బ్యాక్... నిజంగా ఇది ఒక అద్భుతం. మన మెగాస్టార్ చిరంజీవిగారిని ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది. వింటేజ్ వైబ్స్‌తో వెండితెర వెలిగిపోయింది. వెంకీమామ కూడా అదరగొట్టారు. వెంకీగౌడ పాత్రలో అద్భుతంగా నటించారు. నయనతార తన అందం, నటనతో ఆకట్టుకున్నారు. కేథరిన్ చక్కగా నవ్వులు పంచింది.
Details
ప్రతి ఒక్కరూ నటనతో మెప్పించారు
సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలతో మెప్పించారు. ప్రత్యేకంగా సంక్రాంతి స్టార్ బుల్లిరాజు (కొరికేత్తాను.. కొరికేత్తాను..) ప్రేక్షకులను ఫుల్ ఎంటర్‌టైన్ చేశాడు. హుక్ స్టెప్, మెగా విక్టరీ పాటలు థియేటర్లలో విజిల్స్ వేయించేలా ఉన్నాయి. భీమ్స్ సిసిరోలియోకు ప్రత్యేక అభినందనలు. టెక్నికల్ టీమ్, నిర్మాతలు సుస్మిత కొణిదెల, సాహు గారపాటి సినిమాను అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇక బ్లాక్‌బస్టర్ మెషీన్ దర్శకుడు అనిల్ రావిపూడికి ప్రత్యేక శుభాకాంక్షలు. 'సంక్రాంతికి వస్తారు.. హిట్ కొడతారు.. రిపీట్ అంటూ అల్లు అర్జున్ చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించారు. సినిమాపై తన అభిప్రాయాన్ని ఇలా పంచుకున్నందుకు అల్లు అర్జున్‌కు ధన్యవాదాలు తెలుపుతూ, ఇది తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.