NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆదికేశవ గ్లింప్స్: మాస్ బాట పట్టిన ఉప్పెన హీరో 
    తదుపరి వార్తా కథనం
    ఆదికేశవ గ్లింప్స్: మాస్ బాట పట్టిన ఉప్పెన హీరో 

    ఆదికేశవ గ్లింప్స్: మాస్ బాట పట్టిన ఉప్పెన హీరో 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 15, 2023
    05:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉప్పెన చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, ఈసారి కొత్తగా కనిపించాడు. తాజాగా తన నాలుగవ చిత్రాన్ని ప్రకటించాడు.

    ఆదికేశవ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా గ్లింప్స్ ని ఈరోజు రిలీజ్ చేసారు. గ్లింప్స్ వీడియోలో వైష్ణవ్ తేజ్ ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

    గ్లింప్స్ లో కనిపించింది వైష్ణవ్ తేజ్ కాదేమోనన్న అనుమానమూ కలిగింది. అంతలా మారిపోయాడు మరి. గుబురు గడ్డం, పెరిగిన బాడీ.. అచ్చం మాస్ హీరోలా ఉన్నాడు.

    సినిమా కూడా పూర్తిస్థాయి మాస్ చిత్రమేనని గ్లింప్స్ లో కనిపించిన ఫైట్లతో అర్థమైపోయింది. వైష్ణవ్ తేజ్ ని ఈ తరహా యాక్షన్ సీన్లలో చూడటం ఇదే మొదటిసారి.

    Details

    శివుడి గుడి చుట్టూ తిరిగే కథ 

    శివుడి గుడిని కూలగొడదామని విలన్లు ప్రయత్నిస్తుంటే, వాళ్లని ఆపడానికి ఫైట్ చేసే సీన్ ని గ్లింప్స్ లో చూపించారు. చిత్రానికి ఆదికేశవ అనే టైటిల్ పెట్టడంతో, ఈ కథ మొత్తం దేవుడి చుట్టూ తిరుగుతుందని అర్థమవుతోంది.

    ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా కనిపిస్తోంది. గ్లింప్స్ లో అయితే ఆమె ఎక్కడా కనబడలేదు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా మారుతున్నాడు.

    సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్ఛూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లలో రూపొందుతున్న ఈ సినిమాను ఎస్ నాగవంశీ, ఎస్ సౌజన్య నిర్మిస్తున్నారు. జులైలో సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    తెలుగు సినిమా

    ఆదిపురుష్ ట్రైలర్: మే 9వ తేదీన ముహూర్తం; దర్శకుడికి లాస్ట్ ఛాన్స్ అంటున్న నెటిజన్లు  ఆదిపురుష్
    తెలుగు తెరకు సూపర్ స్టార్ కృష్ణ పరిచయం చేసిన సరికొత్త టెక్నాలజీస్ ఏంటంటే?  సినిమా
    లాల్ సలామ్: మొయిదీన్ భాయ్ గా రజనీకాంత్ లుక్ రిలీజ్  సినిమా
    ఎన్టీఆర్ 31: ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ, సాహో భామకు రెండవ తెలుగు సినిమా?  జూనియర్ ఎన్టీఆర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025