NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / పవన్ కళ్యాణ్ అప్పులపై నాగబాబు మాటలు వైరల్
    తదుపరి వార్తా కథనం
    పవన్ కళ్యాణ్ అప్పులపై నాగబాబు మాటలు వైరల్
    పవన్ కళ్యాణ్ కి ఆస్తుల కంటే అప్పులే ఎక్కువని కన్ఫర్మ్ చేసిన నాగబాబు

    పవన్ కళ్యాణ్ అప్పులపై నాగబాబు మాటలు వైరల్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 01, 2023
    01:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు సినిమా హీరోల్లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే ఇద్దరు ముగ్గురు హీరోల్లో పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో ఉంటారని చాలాసార్లు వార్తలు వచ్చాయి.

    పెద్ద మొత్తంలో పారితోషికం అందిపుచ్చుకునే హీరోలకు అప్పులు ఉంటాయని ఎవరూ అనుకోరు. కానీ పవన్ కళ్యాణ్ అప్పుల్లో ఉన్నారని తాజాగా మాటలు వినిపిస్తున్నాయి.

    అటు రాజకీయ పార్టీని, ఇటు సినిమా కెరీర్ ని ముందుకు నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ కి ఆస్తుల కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఈ మాట స్వయంగా పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

    కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా ఈ విషయం వెల్లడించారు. అప్పుల సంగతి చెప్పకపోయినా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలియజేసారు.

    పవన్ కళ్యాణ్

    పిల్లల కోసం దాచిపెట్టిన డబ్బును పార్టీకి వాడేసిన పవన్ కళ్యాణ్

    పవన్ కళ్యాణ్ కి దగ్గరగా ఉండే కొంతమంది కూడా పవన్ అప్పుల గురించి అప్పుడప్పుడు చెప్పుకొచ్చారు. ఇటీవల రైతు భరోసా యాత్ర చేపట్టినపుడు రైతుల సంక్షేమం కోసం పవన్ చాలా ఖర్చు చేసారని అంటున్నారు.

    పవన్ అప్పుల గురించి నాగబాబు మాట్లాడుతూ, పవన్ కి ఆస్తుల కంటే అప్పులే ఎక్కువ ఉన్నాయని నేనంటే ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటున్నాడు కదా అని చెప్తారని నాగబాబు అన్నారు.

    పవన్ తన పిల్లల కోసం దాచి ఉంచిన డబ్బును పార్టీని ప్రారంభించే సమయంలో వాడేసాడని, పవన్ పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవనీ, కేవలం 8ఎకరాల ఫామ్ హౌస్ మాత్రమే ఉందని నాగబాబు చెప్పుకొచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పవన్ కళ్యాణ్
    తెలుగు సినిమా

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    పవన్ కళ్యాణ్

    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? ఆంధ్రప్రదేశ్
    పవన్ కళ్యాణ్ క్రిస్మస్ బహుమతులు… ఆనందంలో ఆ డైరెక్టర్ టాలీవుడ్
    బాలయ్యను కలిసిన పవన్ కళ్యాణ్.. కారణం అదేనంటూ అభిమానుల గోల టాలీవుడ్
    ఆర్ఆర్ఆర్ దూకుడుతో పవన్ అభిమానులు హ్యాపీ.. కారణం అదే తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    వాల్తేరు వీరయ్య ట్విట్టర్ రివ్యూ: చిరంజీవి అభిమానులకు పూనకాలు వాల్తేరు వీరయ్య
    మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయ్ అంటున్న మంచు లక్ష్మీ వీరసింహారెడ్డి
    ఆర్ఆర్ఆర్ హీరోలకు హాలీవుడ్ లో అవకాశం? ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    హృతిక్ రోషన్ పై కామెంట్లకు 14ఏళ్ళ తర్వాత రాజమౌళి వివరణ ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025