NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / టాప్ హీరో దగ్గర పిల్ల స్కూలు ఫీజులకు డబ్బుల్లేవా అంటూ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ సీనియర్ దర్శకుడు
    తదుపరి వార్తా కథనం
    టాప్ హీరో దగ్గర పిల్ల స్కూలు ఫీజులకు డబ్బుల్లేవా అంటూ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ సీనియర్ దర్శకుడు
    పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ తమ్మారెడ్డి భరద్వాజ

    టాప్ హీరో దగ్గర పిల్ల స్కూలు ఫీజులకు డబ్బుల్లేవా అంటూ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ సీనియర్ దర్శకుడు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 31, 2023
    10:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఆయన మీద ఏదో ఒక రకంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆ విమర్శలు రాజకీయాన్ని దాటి వ్యక్తిగతంగా కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

    పవన్ మూడు పెళ్ళిళ్ళపై ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉంటాయి. తాజాగా సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, పవన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేసారు.

    ఒకసారి జనసేన మీటింగ్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పిల్లల కోసం దాచి ఉంచిన డబ్బుతో జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభించానని చెప్పుకొచ్చారు.

    ఈ మాటలపై తమ్మారెడ్డి విరుచుకుపడుతూ, మీరు ఒక్కో సినిమాకి 50 నుండి 80కోట్ల పారితోషికం తీసుకుంటారు కదా, మరి మీకు పిల్లల స్కూలు ఫీజులు కట్టడానికి ఇబ్బంది అయ్యిందా అన్నారు.

    పవన్ కళ్యాణ్

    పార్టీ పెట్టినపుడు సంతోషించిన వారే ఇప్పుడు నీరసించిపోతున్నారని తమ్మారెడ్డి వ్యాఖ్య

    స్కూలు ఫీజులు కట్టడానికి మీకు ఇబ్బంది అయ్యిందా? అలా ఎలా మాట్లాడతారు మీరు, వారానికి ఒకసారి రావడం, మీటింగ్ పెట్టి తిట్టి వెళ్ళిపోవడం ఇదేనా మీరు చేసే పని, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసారా? అని విమర్శించారు తమ్మారెడ్డి.

    ఇంకా ఊరుకోకుండా, అప్పుడే సినిమాలు చేస్తుంటారు, అప్పుడే రాజకీయాలు అంటారు. సినిమాలు చేస్తే పూర్తిగా సినిమాలు చేయండని విమర్శించారు.

    రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినపుడు పవన్ కళ్యాణ్ వేరుగా ఉన్నారని, ఇప్పుడు పూర్తిగా మారిపోయారని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై పెద్ద చర్చ నడుస్తోంది.

    మరి వీటిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పవన్ కళ్యాణ్

    తాజా

    Citroen C3 CNG: పర్యావరణహిత వాహనాల్లో మరో అడుగు.. సిట్రోయెన్ C3 CNG వెర్షన్ ఆవిష్కరణ! ఆటో మొబైల్
    Vitamin D: పిల్లల నుంచి పెద్దల వరకూ... అందరికీ అవసరం 'డి విటమిన్‌'  జీవనశైలి
    Tirupati: తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శ్రీకారం.. శ్రీవారి ఆలయ శైలిలో డిజైన్‌ తిరుపతి
    RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! సంజయ్ మల్హోత్రా

    పవన్ కళ్యాణ్

    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? ఆంధ్రప్రదేశ్
    పవన్ కళ్యాణ్ క్రిస్మస్ బహుమతులు… ఆనందంలో ఆ డైరెక్టర్ టాలీవుడ్
    బాలయ్యను కలిసిన పవన్ కళ్యాణ్.. కారణం అదేనంటూ అభిమానుల గోల టాలీవుడ్
    ఆర్ఆర్ఆర్ దూకుడుతో పవన్ అభిమానులు హ్యాపీ.. కారణం అదే తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025