అన్ స్టాపబుల్: త్రివిక్రమ్ తో స్నేహం చేయాల్సొచ్చిందన్న పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. బాలయ్య వ్యాఖ్యాతగా ఉన్న అన్ స్టాపబుల్ షో నుండి పవన్ కళ్యాణ్ ప్రోమో విడుదలైంది. అన్ స్టాపబుల్ షోలోకి అతిధిగా పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలిసినప్పటి నుండి అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఇంతవరకు ఎప్పుడూ పవన్ కళ్యాణ్ నుండి బయటకు రాని సమాధానాలు అన్ స్టాపబుల్ ద్వారా వస్తాయని ఊహించారు. రిలీజైన ప్రోమో మొదటి భాగం చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. ఈశ్వరా, పవనేశ్వరా, పవరేశ్వరా అంటూ ప్రోమో మొదట్లో బాలయ్య మాట్లాడడం, ఆ తర్వార నేను మీకు తెలుసు నా స్థానం మీ మనసు అని బాలయ్య మాటలను పవన్ కళ్యాణ్ చెప్పడం ఆహ్లాదంగా ఉంది.
పెళ్ళిళ్ళ గొడవపై పెదవి విప్పిన పవన్ కళ్యాణ్
ఈ ప్రోమోలో ముఖ్యంగా మూడు విషయాలు ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. త్రివికమ్, మీరు మంచి ఫ్రెండ్స్ కదా అని బాలయ్య అడిగినపుడు ఫ్రెండ్స్ అవ్వాల్సొచ్చిందని పవన్ కళ్యాణ్ చెప్పడం, ఆ తర్వాత ఎపిసోడ్ లోకి మెగా మేనల్లుడు సాయి ధరమ్ రావడం, తొడగొట్టమని బాలయ్య అడిగితే, వెళ్ళి బాలయ్య తొడగొట్టాలని సాయి ధరమ్ తేజ్ ట్రై చేయడం నవ్వులు తెప్పించాయి. ఇకపోతే పెళ్ళిళ్ళ గొడవేంటి భయ్యా అని బాలయ్య అడిగాడు. దానికి పవన్ కళ్యాణ్ సమాధానం తెలుసుకోవాలంటే పూర్తి ఎపిసోడ్ రిలీజ్ అయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే అని అర్థమైంది. మొదటి ప్రోమోలో కుటుంబం గురించీ, పవన్ గురించీ ఉండడంతో, రెండవ ప్రోమోలో రాజకీయ అంశాలు ఉంటాయని క్లియర్ గా తెలుస్తోంది.