Page Loader
అన్ స్టాపబుల్: బాలయ్య షోలో సందడి చేయనున్న రామ్ చరణ్, కేటీఆర్?
బాలయ్య అన్ స్టాపబుల్

అన్ స్టాపబుల్: బాలయ్య షోలో సందడి చేయనున్న రామ్ చరణ్, కేటీఆర్?

వ్రాసిన వారు Sriram Pranateja
Jan 04, 2023
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆహా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో నుండి రోజుకో కొత్త న్యూస్ బయటకు వస్తోంది. బాలయ్య వ్యాఖ్యాతగా ఉన్న ఈ షో, జెట్ స్పీడులో దూసుకుపోతుంది. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్ చెలరేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ప్రభాస్ ఎపిసోడ్ రిలీజైన రోజు సర్వర్ క్రాష్ అయ్యిందంటే ఆ షో పట్ల జనాలు ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఆ ఆసక్తిని మరింత పెంచేందుకు అన్ స్టాపబుల్ బృందం ప్రయత్నిస్తూనే ఉంది. తాజగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం, అన్ స్టాపబుల్ షోలో తర్వాతి అతిధిగా రామ్ చరణ్ కనిపించనున్నట్లు వినిపిస్తోంది. రామ్ చరణ్ తో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా షోలోకి వస్తున్నట్లు తెలుస్తోంది.

అన్ స్టాపబుల్

పవన్ ఎపిసోడ్ ఎప్పుడంటే

దీనిపై ఇంకా క్లారిటీ రానప్పటికీ ప్రచారాలు మాత్రం జోరందుకున్నాయి. ప్రభాస్ ఎపిసోడ్ లో కూడా రామ్ చరణ్ తో కాల్ లో మాట్లాడాడు బాలయ్య. దాంతో అన్ స్టాపబుల్ షోలోకి రామ్ చరణ్ ఎంట్రీ ఉంటుందని అర్థమైపోయింది. కేటీఆర్ కూడా వస్తున్నారని వార్తలు రావడంతో అందరికీ ఆసక్తి పెరిగిపోయింది. తెలుగు చిత్రపరిశ్రమలోని హీరోలతో డైరెక్టర్లతో కేటీఆర్ సన్నిహితంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. అందువల్ల కేటీఆర్, రామ్ చరణ్ లు షోకి వస్తే బాగుంటుందని అభిమానులు కూడా ఆశపడుతున్నారు. మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి. ప్రభాస్ తర్వాత అన్ స్టాపబుల్ షోలోకి పవన్ కళ్యాణ్ వచ్చారు. ఈ ఎపిసోడ్ ని జనవరి చివర్లో లేదా ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.