'వీరమల్లు' నుంచి పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారిగా తన కెరీర్ లో పీరియాడిక్ డ్రామాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన ఫుల్ ఫోకస్ తో యాక్షన్ ఎపిసోడ్ లను తెరకెక్కిస్తున్నాడు. హరిహర వీరమల్లు చిత్రాన్ని దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
గత రెండేళ్ల నుండి షూటింగ్ అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూనే వచ్చింది. అయితే ఈ మధ్య క్రిష్ వేగంగానే షూట్ పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి గ్లిమ్స్ టీజర్స్, పోస్టర్ వంటివి రీలీజ్ కావడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది.
పవన్ కళ్యాణ్
జనవరి 26న ఫుల్ టీజర్..?
ఇక తాజాగా చిత్రంపై మరో అదిరిపోయే అప్డేట్ ను నిర్మాత ఏఎం రత్నం అందించారు. ఈ రిపబ్లిక్ డే (జనవరి 26)న ఫ్యాన్స్ కు భారీ ట్రీట్ అందిస్తామని స్పష్టం చేశారు. హరిహార వీరమల్లు నుంచి పవర్ ఫుల్ టీజర్ రాబోతుందని వెల్లడించారు. ఈ వార్త తెలియడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో రాబిన్ హుడ్ లాంటి పాత్రలో నటించ బోతున్నాడు
ప్రస్తుతం 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే2'షో వీడియో కోసం బాలయ్య - పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నిన్న రాత్రి విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతోంది