Balu Jeans: పవన్ ప్యాంట్ ఖరీదు 75 వేలు... బాలు జీన్స్‌పై రేణు సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
సినిమాల్లో హీరోల లుక్ ప్రేక్షకులను ఎంతగా ప్రభావితం చేస్తుందో చెప్పడానికి పవన్ కల్యాణ్ నటించిన 'బాలు' సినిమా ఒక ఉదాహరణ. 2005లో విడుదలైన ఈ చిత్రంలో ఆయన ధరించిన లూజ్ జీన్స్ అప్పట్లో యువతలో ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఆ ప్యాంట్ వెనుక ఇంత పెద్ద కథ ఉందని చాలామందికి తెలియదు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నటి రేణు దేశాయ్ ఈ విషయాలను బయటపెట్టారు. ఆ ప్యాంట్ కోసం అప్పట్లో ఏకంగా రూ.75 వేలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
Details
పవన్ కోసం లండన్, మిలాన్‌లో షాపింగ్
పవన్ కల్యాణ్ సినిమాలకు దుస్తులు ఎంపిక చేసేందుకు తాను లండన్, మిలాన్ నగరాల్లో షాపింగ్ చేసేవారినని రేణు గుర్తుచేసుకున్నారు.
సెల్ఫ్రిడ్జెస్ మాల్‌లో గ్యాప్, అబర్‌క్రాంబీ అండ్ ఫిచ్, స్టోన్ ఐలాండ్ వంటి బ్రాండ్ల దుస్తులను పరిశీలించేవారట.
ముఖ్యంగా స్టోన్ ఐలాండ్ దుస్తులను ఎక్కువగా ఎంపిక చేసేవారని చెప్పారు. అప్పట్లో పవన్ తెరపై కనిపించే ప్రతి లుక్ వెనుక ప్రత్యేక శ్రద్ధ ఉండేదని ఆమె మాటల్లో అర్థమవుతోంది.
Details
షారుక్ కోసం కరణ్ జోహార్ కూడా!
లండన్‌లో షాపింగ్ సమయంలో బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ కూడా తరచూ కనిపించేవారని రేణు తెలిపారు.
అయితే ఆయన తన కోసం కాకుండా షారుక్ ఖాన్ కోసం దుస్తులు ఎంపిక చేసేందుకు వచ్చేవారట. షారుక్‌పై ఉన్న అభిమానంతో కరణ్ స్వయంగా బట్టలు వెతికేవారని చెప్పారు.
తాను కూడా పవన్ కోసం అదే ఇష్టంతో దుస్తులు ఎంపిక చేసేదాన్నని గుర్తుచేసుకున్నారు. తనను కాస్ట్యూమ్ డిజైనర్ అనడం కంటే స్టైలిస్ట్ అనడమే సరైనదని స్పష్టం చేశారు.
Details
మిలాన్‌లో దొరికిన ప్రత్యేకమైన ప్యాంట్
'బాలు' సినిమాలో కనిపించిన ప్రత్యేకమైన ప్యాంట్ మిలాన్‌లోని ఓ హైఎండ్ ఫ్యాషన్ స్టోర్‌లో కనిపించిందట.
రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి అసలైన వస్త్రంతో తయారు చేశామని అక్కడి వారు చెప్పినట్లు రేణు వెల్లడించారు.
ఆ క్లాత్‌తో కేవలం ఐదు ప్యాంట్లు మాత్రమే తయారు చేశారని, వాటిలో ఒకటి ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్హామ్‌కు వెళ్లిందని తనకు వివరించారట.
Details
మూడు నెలల నిరీక్షణ.. రూ.75 వేల ఖర్చు
ఆ ప్యాంట్ కోసం ముందుగా రూ.25 వేలు అడ్వాన్స్ చెల్లించి, మూడు నెలలు వేచి చూశారు. తర్వాత దాన్ని తీసుకురావడానికి ప్రత్యేకంగా మిలాన్ వెళ్లినట్లు రేణు చెప్పారు.
మొత్తం ధర అప్పట్లో రూ.75 వేలు. సినిమాలో పలు సన్నివేశాల్లో అదే ప్యాంట్ కనిపించాల్సి ఉండటంతో నిర్మాతను కూడా ఒప్పించారట.
సాధారణంగా పది ప్యాంట్లు కొంటే రూ.50 వేలు ఖర్చవుతుందని, మరో రూ.25 వేలు పెడితే ప్రత్యేకమైన ప్యాంట్ వస్తుందని వివరించడంతో నిర్మాత అంగీకరించినట్లు తెలిపారు.
అప్పట్లోనే ఒక సినిమా లుక్ కోసం ఇంత ప్రత్యేకంగా ఆలోచించడం ఆసక్తికరంగా మారింది.