LOADING...
Pawan Kalyan : న్యూ ఇయర్ రోజు ఫ్యాన్స్ కి పండగే.. రామ్ తాళ్లూరి-సురేంద్ర రెడ్డి కాంబినేషన్‌లో పవన్ కొత్త మూవీ
రామ్ తాళ్లూరి-సురేంద్ర రెడ్డి కాంబినేషన్‌లో పవన్ కొత్త మూవీ

Pawan Kalyan : న్యూ ఇయర్ రోజు ఫ్యాన్స్ కి పండగే.. రామ్ తాళ్లూరి-సురేంద్ర రెడ్డి కాంబినేషన్‌లో పవన్ కొత్త మూవీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 01, 2026
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

డిప్యూటీ సీఎం గా ఎంతో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న సినిమాలు చేసి ఆపేస్తారని అనుకుంటున్నా సమయంలో OG మూవీ భారీ హిట్ కావడంతో, OG 2 కూడా చేస్తానని ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చారు. త్వరలో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా వస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలో, తాజాగా ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ రోజు ఫుల్ సంతోషాన్ని ఇచ్చే వార్త ప్రకటించారు. నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నేడు పవన్ కళ్యాణ్ తన కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు. గతంలో కూడా పవన్, సురేందర్ రెడ్డి,రామ్ తాళ్లూరి కలిసి ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.

వివరాలు 

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్ తాళ్లూరి

కానీ, పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం, ఇతర ప్రాజెక్టుల కారణంగా ఆ సినిమా పక్కన పెట్టేసారు అనుకున్నారు అభిమానులు అంతా. ఇప్పుడు అదే ప్రాజెక్టును మళ్లీ కొత్తగా ప్రకటించారు. నిర్మాత రామ్ తాళ్లూరి,డైరెక్టర్ సురేందర్ రెడ్డి కలిసి పవన్ కళ్యాణ్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, ఈ సినిమా ప్రారంభాన్ని అధికారికంగా ప్రకటించారు. రామ్ తాళ్లూరి ప్రస్తుతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేస్తున్నారు. రామ్ తాళ్లూరి ఈ సినిమా గురించి ప్రకటిస్తూ.., "నా డ్రీమ్ ప్రాజెక్ట్‌లో, పవన్ కళ్యాణ్ పేరు పెట్టిన జైత్ర రామ్ మూవీస్ బ్యానర్‌ కింద, సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీతో కలిసి పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయబోతున్నాం" అని తెలిపారు.

వివరాలు 

తక్కువ హెయిర్ ఉన్న కొత్త లుక్ లో  పవన్ కళ్యాణ్ 

ఇటీవల పవన్ కళ్యాణ్ కొత్త లుక్‌లో, తక్కువ హెయిర్ స్టైల్‌తో కనిపిస్తున్నారు. ఈ లుక్ ఈ కొత్త సినిమా కోసమేనని అభిమానులు భావిస్తున్నారు . మొత్తానికి డిప్యూటీ సీఎం గా ఎంత బిజీగా ఉన్నా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రకటించడంతో ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. గతంలో రామ్ తాళ్లూరి నిర్మాతగా SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో నెల టికెట్, చుట్టాలబ్బాయి, మెకానిక్ రాకీ వంటి పలు సినిమాలను నిర్మించారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాత రామ్ తాళ్లూరి చేసిన ట్వీట్ 

Advertisement