Hellallallo song: 'పెద్ది' ఐటెం సాంగ్ విడుదల.. రామ్ చరణ్‌తో శ్రుతి హాసన్ స్టెప్పులు అదుర్స్
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 24, 2026
11:58 am
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమాలోని ప్రత్యేక ఐటెం సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. "చీర.. చొక్క.. చిక్కెడిపోవాలో.." అంటూ సాగే ఈ పాటలో శ్రుతి హాసన్ తన స్టెప్పులతో సందడి చేశారు. రామ్ చరణ్‌తో కలిసి ఆమె చేసిన డ్యాన్స్ అభిమానులను అలరిస్తోంది. ఆదివారం ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్ కూడా ఈ పాటలో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముగ్గురు స్టార్లు కలిసి చేసిన డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
వివరాలు
జూన్ 4న రిలీజ్
ఈ పాటకు ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, గాయని రక్షిత సురేశ్ ఆలపించారు. సంగీతాన్ని ఏఆర్. రెహమాన్ సమకూర్చారు. బుబ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.